నటీమణులపై లైగిక దాడుల అంశంపై స్పందించిన బాలకృష్ణ హీరోయిన్!

హాలీవుడ్ నిర్మాత హార్వే విన్‌స్టైన్ చేసిన లైగిక దాడులు సంచలనమైయింది. హార్వే యాంజెలీనా జోలీ, గ్వానిత్ పాల్టరౌ, యాష్లే జడ్ వంటి హాలీవుడ్ అందాల నటీమణులెందరినో లైగికంగా వేధించాడని హాలీవుడ్ వార్తాపత్రికలు కథనాలు రాసాయి. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయి మీద కూడా హార్వే లైగిక దాడి చేయబోయాడని, తాను కాపాడినట్లు ఆమె మాజీ మేనేజర్ చెప్పడం దుమారం లేపింది. ఈ ఉదంతం సామజిక మాధ్యమం లో ఓ ఉద్యమానికి నాంది పలికింది. #metoo అనే హ్యాష్ట్యాగ్ జత చేసి ఎవరికీ వారు వారికీ జరిగిన లైగిక దాడిని షేర్ చేసుకుంటున్నారు.

ప్రియాంక చోప్రా వంటి టాప్ నటీమణులందరు ఈ హ్యాష్ట్యాగ్ ను ట్రెండ్ చేయగా, తాజాగా బాలకృష్ణ సరసన లెజెండ్. లయన్ చిత్రాలలో తళుక్కుమన్న బాలీవుడ్ భామ రాధికా ఆప్టే కూడా ఉద్యమానికి మద్దతు పలికింది. ముంబై లో జరుగుతున్న మామి ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఆమె, తనకు ఎప్పుడు బలవంతపు లైగిక దాడి అనుభవం లేదని, అయినా తాను #metoo సామజిక ఉద్యమానికి తన సపోర్ట్ ను తెలుపుతున్నట్లు ప్రకటించింది.