నారా రోహిత్.. నువ్వు తోపు రాజా..!


అవును.. ఇప్పుడు ఈ టైటిల్ మ‌నోడికి ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది. గీతలో శ్రీ‌కృష్ణుడు ఏం చెప్పాడంటే ఏమో భ‌య్యా నాకు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు అనే టైప్ ఈ హీరో. కానీ అందులో కృష్ణుడు చెప్పిన దాన్ని మాత్రం ప‌క్కాగా ఫాలో అవుతున్నాడు ఈ కుర్ర హీరో. ప‌ని చేయ్.. ఫ‌లితం ఆశించ‌కు..! అవును.. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక్క‌సారి నారా రోహిత్ కెరీర్ ను చూస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది. ఫ్రెండ్స్ కోసం.. కావాల్సిన వాళ్ల కోసం.. త‌న కోసం ఇలా అన్ని సినిమాలు చేస్తూనే ఉంటాడు. 365 డేస్ డేట్స్ ఇస్తూనే ఉంటాడు. కానీ అవి వ‌స్తున్నాయా.. ఎప్పుడు వ‌స్తాయి.. వ‌స్తే ఆడుతున్నాయా లేదా అనేది మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోడు ఈ హీరో.
మిగిలిన హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయ‌డానికే నానా తంటాలు ప‌డుతుంటే.. రోహిత్ మాత్రం ఏకంగా అర‌డ‌జ‌న్ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌రో అర‌డ‌జ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ద‌ర్శ‌కులు కూడా నారా వార‌సుడి కోసం క‌థ‌లు రాస్తూనే ఉన్నారు. గ‌త ఏడాది కాలంలో రోహిత్ ఏకంగా 8 సినిమాలు విడుద‌ల చేసాడు. కానీ ఇందులో ఒక‌ట్రెండు కూడా సూప‌ర్ హిట్ కాలేదు. దానిపై ఒక్క‌సారైనా నారా రోహిత్ త‌న కెరీర్ ను తానే విశ్లేషించుకోవాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. ప్ర‌స్తుతం ఈయ‌న వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు సినిమా చేస్తున్నాడు.
సుధీర్ బాబు ఇందులో మ‌రో హీరో. గ‌తంలో ఈ ఇద్ద‌రు క‌లిసి శ‌మంత‌క‌మ‌ణిలో న‌టించారు. ఇంద్ర‌సేన ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో శ్రీ‌య హీరోయిన్ గా న‌టిస్తుండ‌టం విశేషం. దాంతోపాటు జులై 25న ఈయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌రో రెండు సినిమాల ఫ‌స్ట్ లుక్ లు వ‌చ్చేసాయి. బాణం ఫేమ్ చైత‌న్య దంతులూరితో అన‌గ‌న‌గా ద‌క్షిణాదిలో సినిమా క‌మిట‌య్యాడు రోహిత్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి షూటింగ్ మొద‌లు కానుంది.
ఇక కొత్త ద‌ర్శ‌కుడు ఎస్ డీ చ‌క్ర‌వ‌ర్తితో త‌న నిర్మాణంలోనే ఓ సినిమా చేయ‌బోతున్నాడు. వీటితో పాటు జ‌గ‌ప‌తిబాబుతో ప్ర‌స్తుతం ఆట‌గాళ్లు సినిమా చేస్తున్నాడు. దానికి తోడు ఎన్ఆర్ 18 అంటూ ఆ మ‌ధ్య మ‌రో కొత్త పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో మూగ‌వాడిగా న‌టించ‌నున్నాడు రోహిత్. ఇలా ఎన్ని సినిమాలు చేస్తున్నాడో త‌న‌కు కూడా తెలియ‌నంత బిజీగా ఉన్నాడు రోహిత్. మ‌రి ఇందులో ఏది మ‌నోడికి హిట్ ఇస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here