నిహారికకు మళ్లీ షాక్ తప్పదా..?

HAPPY WEDDIG NIHARIKA
ఒకమనసు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది నిహారిక. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కచ్చితంగా ఆ అంచనాలు అనేవి భారీగానే ఉంటాయి. అది నిహారికకు కూడా తెలియంది కాదు. అవి అందుకోవడంలో తొలి సినిమాతో దారుణంగా ఫ్లాప్ అయింది ఈ భామ.
ఫ్లాప్ తో పాటు పేరు ఖరాబ్ చేస్తుందంటూ విమర్శలు కూడా రావడంతో బాగా గ్యాప్ తీసుకుని రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ హ్యాపీవెడ్డింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగా డాటర్. అయితే ఈ సారి కూడా నిహారిక కలలు నిలబడేలా లేవు.
హ్యాపీవెడ్డింగ్ కు కూడా టాక్ తేడాగానే వచ్చేసింది. మరీ వెబ్ సిరీస్ లా ఉందంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
కొత్త దర్శకుడు లక్ష్మణ్ కార్యా మంచి కాన్సెప్ట్ నే తీసుకున్నా కూడా దాన్ని తెరకెక్కించడంలో విఫలం అయ్యాడనేది ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న వాదన. పైగా సరైన వసూళ్లు కూడా తొలిరోజు సాధించలేకపోయింది ఈ చిత్రం. దాంతో నిహారికకు రెండో సినిమా కూడా ఆశలు తీర్చనట్లే కనిపిస్తుంది. కొన్ని రోజులుగా హ్యాపీవెడ్డింగ్ పైనే ఆశలన్నీ పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. మరి చూడాలిక.. ఈ మెగా ఇంటి అమ్మాయి హిట్ కల తీర్చే ఆ దర్శకుడు ఎక్కడున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here