న‌ట‌సార్వ‌భౌముడితో అనుప‌మ‌..!

అవునా.. న‌ట‌సార్వ‌భౌముడు ఎవ‌రు.. అది ఒక్క ఎన్టీఆరే క‌దా.. ఇప్పుడు ఆయ‌న‌తో అనుప‌మ ఎలా జ‌త‌క‌డుతుంది.. కొంప‌దీసి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కానీ న‌టిస్తుందా ఏంటి అనుకుంటున్నారా..? అదేం లేదు కానీ అనుప‌మ మాత్రం న‌ట‌సార్వ‌భౌముడితో న‌టిస్తుంది. దీని వెన‌క చిన్న ట్విస్ట్ ఉంది.

అదేంటంటే.. ఇన్నాళ్లు తెలుగు, త‌మిళ, మ‌ళ‌యాల‌ ఇండ‌స్ట్రీల్లో మాత్ర‌మే న‌టిస్తూ వ‌చ్చిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్తుంది. అక్క‌డ తొలి సినిమాలోనే ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో న‌టించ‌బోతుంది. ఆ సినిమా పేరు న‌ట‌సార్వ‌భౌమ‌. ప‌వ‌న్ వ‌డ‌యార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పునీత్ ప‌వ‌ర్ ఫుల్ మాస్ లీడ‌ర్ గా న‌టించ‌బోతున్నాడు. ఈ చిత్రం కోసం అనుప‌మ‌ను ఆడిగారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీనికి ఈ భామ కూడా ఓకే చెప్పింద‌నే తెలుస్తుంది. ఇన్నాళ్లూ మూడు ఇండ‌స్ట్రీల్లో న‌టించిన ఈ భామ‌.. ఇప్పుడు ఆ నాలుగో ఇండ‌స్ట్రీని కూడా క‌వ‌ర్ చేస్తుంద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here