న‌వంబ‌ర్ 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా U/A స‌ర్టిఫికేట్ తో సందీప్‌కిష‌న్‌ న‌టించిన “కేరాఫ్ సూర్య”  విడుద‌ల 

న‌గ‌రం, స‌మంత‌క‌మ‌ణి లాంటి చిత్రాల త‌రువాత సందీప్ కిషన్, మ‌హ‌నుభావుడు, రాజాదిగ్రేట్ చిత్రాల త‌రువాత హ్య‌ట్రిక్ క్వీన్‌ మెహ్రీన్ జంటగా , నా పేరు శివ లాంటి నేచుర‌ల్ హిట్ ని అందించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంక‌ర్‌ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో , స్వామిరారా, వీడుతేడా లాంటి మంచి చిత్రాల త‌రువాత‌  చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైల‌ర్, రెండు సాంగ్స్‌ తో ఈ సినిమాకు ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడింది. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యుఏ స‌ర్టిఫికేట్ తో ప్ర‌పంప‌చ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 10న విడుద‌ల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ…. కేరాఫ్ సూర్య చిత్ర టీజర్, రెండు సాంగ్స్ ని విడుద‌ల చేశాము. టీజ‌ర్ కి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కి కూడా ఆ రేంజి ప్ర‌శంశ‌లు రావ‌టం చాలా ఆనందంగా వుంది. అంతేకాకుండా ట్రేడ్ లో బిజినెస్ కూడా స్పీడ్ అందుకోవ‌టం విశేషం. మా టీజ‌ర్ ని విడుల చేసిన నాని గారికి, సాంగ్స్ విడుదల చేసిన ర‌కూల్ ప్రీత్ సింగ్‌, కాజ‌ల్ గారికి మా ధ‌న్య‌వాదాలు.  ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ప‌క్కింటి కుర్రాడుగా తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. టాలీవుడ్ ల‌క్కీ హీరోయిన్ మెహ్రిన్‌ కు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిక్‌ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నాం. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. త్వరలోనే ధియోట్రిక్ ట్రైల‌ర్ ని, ఆడియో ఫంక్ష‌న్ ని చేస్తున్నాం. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.అని అన్నారు
సందీప్ కిషన్ మాట్లాడుతూ…. కేరాఫ్ సూర్య షూటింగ్ దశలోనే నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిన చిత్రం. అలాంటి చిత్ర టీజర్ ను నా బెస్ట్ ఫ్రెండ్స్ నాని, సాంగ్స్ ని ర‌కూల్‌, కాజ‌ల్ లు రిలీజ్ చేయడం అవి మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ద‌ర్శ‌కుడు  సుశీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శివ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా కొత్త అనుభూతినిచ్చింది. ప్రతీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నాను. ప్రతీ సీన్, ప్రతీ ఎమోషన్ ప్రతీ ఒక్కరినీ టచ్ చేస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మెహ్రీన్ సూపర్ యాక్ట్రెస్. ఆమెకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఇమ్మాన్ మ్యూజిక్ మరో లెవల్ కు తీసుకెళ్తుంది. చిత్రాన్ని న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్నారు. అని అన్నారు.
సంగీతం- ఇమ్మాన్ , యాక్ష‌న్‌- అంబు అర‌వి, డాన్స్‌- షోబి, లిరిక్స్‌- రామ‌జోగ‌య్య శాస్త్రి, స‌హ‌నిర్మాత‌- రాజేష్ దండు, నిర్మాత‌- చ‌క్రి చిగురుపాటి, ద‌ర్శ‌కుడు- సుశీంద్ర‌న్‌