పండ‌క్కి ఏ బొమ్మ అదురుతుంది..?

SANKRANTHI MOVIES ALL MOVIES ROUTINE NOT POSITIVE
ఇప్ప‌టికే ప‌వ‌న్ ప‌క్కకెళ్లిపోయాడు. ఈయ‌న మ‌ళ్లీ లేచే అవ‌కాశం.. లేస్తాడ‌నే న‌మ్మ‌కం.. లేస్తున్నాడ‌నే ఆశ కూడా ఎవ‌రిలోనూ క‌నిపించ‌ట్లేదు. వెంకీ సీన్స్ యాడ్ చేసినా కూడా ఇప్పుడు అజ్ఞాత‌వాసి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింది. ఈ చిత్రం అతిపెద్ద డిజాస్ట‌ర్ గా మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. తొలిరోజు 40 కోట్లు వ‌సూలు చేసిన సినిమా.. రెండో రోజుకు వ‌చ్చేస‌రికి 5 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 27 కోట్ల షేర్ తీసుకొస్తే.. రెండో రోజుకు అది 4 కోట్ల‌కు ప‌డిపోయింది. ఈ లెక్క‌న అజ్ఞాత‌వాసి ఎంత‌గా డ్రాప్ అయిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ టైమ్ లో జై సింహాకు యావ‌రేజ్ అనే టాక్ వ‌చ్చింది.. గ్యాంగ్ కూడా ప‌ర్లేదంటున్నారు. ఈ రెండు సినిమాల మ‌ధ్య క‌చ్చితంగా ప‌వ‌న్ సినిమా న‌లిగిపోవ‌డం ఖాయం. ఇదిలా ఉంటే సైలెంట్ గా రంగుల‌రాట్నం వ‌స్తుంది. ఇవ‌న్నీ చూస్తుంటే ఈ సంక్రాంతి ఊహించినంత రేంజ్ లో మాత్రం లేదు. గ‌త మూడేళ్లుగా సంక్రాంతి సినిమాల‌న్నీ స‌త్తా చూపించాయి. కానీ ఈ సారి మాత్రం చ‌రిత్ర‌లో నిలిచిపోయే చెత్త సంక్రాంతిగా మారింది. చూడాలిక‌.. ఈ సంక్రాంతిని ఎవ‌రు క్యాష్ చేసుకుంటారో.??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here