ప్రివ్యూ: అ..!

Nani AWE
అ.. మిస్ట‌రీ వీడ‌బోతుంది. ఇంకా కొన్ని గంట‌ల్లో ఈ సినిమాలో ఏముందో బ‌య‌టికి రాబోతుంది. నెల రోజులుగా ప్రేక్ష‌కుల బుర్ర‌ల‌తో ఆడుకుంటున్న ఈ సినిమాలో ఏం ఉండ‌బోతుందో తెలియ‌డానికి ఇంకాస్త ఓపిక ప‌డితే స‌రిపోతుంది. ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి క‌థ‌తో మా సినిమా వ‌స్తుంద‌ని నిర్మాత నాని చెబుతున్నాడు. మ‌రి ఆ కొత్త‌ద‌నం ఎలా ఉంటుందో మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. మా సినిమా కొత్త‌గా ఉంటుంది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ‌తో ఏ సినిమా రాలేదు.. అని చెప్పుకోడానికి ఏ ద‌ర్శ‌క నిర్మాత అయినా భ‌య‌ప‌డ‌తాడు. కానీ ఇప్పుడు నాని ఇది చేస్తున్నాడు. ధైర్యంగా త‌న సినిమా గురించి చెప్పుకున్నాడు. ఆ న‌మ్మ‌కం ఎలా ఉండ‌బోతుందో ఇప్పుడు బ‌య‌టికి రానుంది.
అస‌లు అ.. సినిమాలో ఏముందో తెలియ‌క ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై రాని క‌థ అంటే ఏదో కొత్త‌గా ఉంటుంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. పైగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్స్ కూడా సినిమాపై ఆస‌క్తి రెండింత‌లు చేస్తున్నాయి. ఇందులో నాని చేప‌గా.. ర‌వితేజ చెట్టుగా న‌టించారు. ఈ లుక్స్ కూడా ఇప్ప‌టికే విడుద‌లయ్యాయి. ఇక రెజీనా విల‌న్ గా.. శ్రీ‌నివాస్ అస‌వ‌రాల ఏదో సైంటిస్ట్ గా.. నిత్యా మీన‌న్ లెస్బియ‌న్ పాత్ర‌లో.. ఇషారెబ్బా డిఫెరెంట్ కోణంలో.. ప్రియదర్శి ఫేక్ చెఫ్ గా న‌టిస్తున్నారు. అస‌లు అ.. వెన‌క ఉన్న మిస్ట‌రీ ఏంటో ఫిబ్ర‌వ‌రి 16న తేల నుంది. ఈ చిత్రం అదే రోజు విడుదల కానుంది. ఓవ‌ర్సీస్ లో 110 లొకేష‌న్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అ.. భారీగానే విడుద‌ల‌వుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here