బామ్మ‌ర్ది దెబ్బ‌.. బావ అబ్బ‌బ్బా..!

Supreme Hero SaiDharamTej's Solo Stills From Jawaan
మ‌నం చిన్న‌పుడు తాబేలు, కుందేలు క‌థ చదువుకున్నాం క‌దా..! కుందేలు ముందు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు చాటున కునుకు తీస్తుంది. ఆ గ్యాప్ లో తాబేలు పందెం గెలిచేస్తుంది. ఇప్పుడు ఈ క‌థ ఎందుకు అనుకుంటున్నారా..? ఇదే క‌థ సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్ ల‌కు బాగా సూట్ అవుతుంది. ఈ క‌థ‌లో తాబేలు వ‌రుణ్ తేజ్ అయితే.. కుందేలు సాయిధ‌రంతేజ్. కుందేలు మాదిరే రేస్ చాలా ఫాస్ట్ గా మొద‌లుపెట్టాడు సాయిధ‌రం. ఈ హీరో కెరీర్ రాకెట్ స్పీడ్ లో మొద‌లైంది.  పిల్లా నువ్వులేని జీవితం.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్.. సుప్రీమ్ లాంటి విజ‌యాల‌తో చాలా త్వ‌ర‌గా 25 కోట్ల మార్కెట్ అందుకున్నాడు సాయి. దాంతో మ‌నోడి కెరీర్ కు తిరుగులేదు.. స్టార్ అయిపోవ‌డం ఖాయం అనుకున్నారంతా. అదే టైమ్ లో వ‌రుణ్ తేజ్ కెరీర్ చాలా నెమ్మ‌దిగా మొద‌ల‌వుతుంది. ముకుందా ఫ్లాప్.. కంచె మంచి సినిమా.. లోఫ‌ర్.. మిస్ట‌ర్ డిజాస్ట‌ర్లు.. ఇలా మొద‌లైంది వ‌రుణ్ తేజ్ కెరీర్. ఇదే టైమ్ లో సాయి కెరీర్ రైజింగ్ లో ఉంది.
దాంతో మెగా ఫ్యామిలీలో సాయిధ‌రంతేజ్ నెక్ట్స్ స్టార్ అనుకున్నారు. వ‌రుణ్ తేజ్ మాత్రం నిల‌బ‌డ్డానికి చాలా టైమ్ ప‌డుతుంద‌నుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిపోయింది. వ‌రుణ్ తేజ్ మెల్ల‌గా స్టార్ అయిపోతున్నాడు.. సాయిధ‌రంతేజ్ కెరీర్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మ‌న‌కు క‌నిపిస్తుంది. తాజాగా వ‌చ్చిన ఇంటిలిజెంట్ కూడా డ‌బుల్ డిజాస్ట‌ర్ అయిపోయింది. ఈ చిత్రం దారుణంగా ప‌డిపోయింది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌. వినాయ‌క్ కూడా ఈ చిత్రాన్ని కాపాడ‌లేక‌పోతున్నాడు. దీనికి ముందు తిక్క‌.. విన్న‌ర్.. న‌క్ష‌త్రం.. జ‌వాన్ ఫ్లాపులున్నాయి సాయికి.
ఈ స‌మ‌యంలోనే గ‌తేడాది ఫిదాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు వ‌రుణ్ తేజ్. ఈ చిత్రంతో మ‌నోడి కెరీర్ గాడిన ప‌డింది. ఇప్పుడు వ‌చ్చిన తొలిప్రేమకి కూడా సూప‌ర్  హిట్ టాక్ వ‌చ్చేసింది. కొత్త ద‌ర్శ‌కుల‌ను.. టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కులను ఎంచుకుంటున్నాడు వ‌రుణ్. ఇదే టైమ్ లో సాయిధ‌రంతేజ్ మాత్రం రొటీన్ క‌థ‌ల‌కు.. ద‌ర్శ‌కుల‌కు ఓకే చెబుతూ త‌న కెరీర్ ను తానే నాశ‌నం చేసుకుంటున్నాడు. ఈ ఊపులో వ‌రుణ్ కు ఇంకొక్క హిట్ ప‌డితే సాయి సీన్ లో కూడా క‌నిపించ‌డేమో మ‌రి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here