బాల‌య్య ఆ ప‌ని మీదున్నాడిప్పుడు..

jai simha Bala Krishna Pressmeet Photos (1)
కెరీర్ లో చాలా ఏళ్ల త‌ర్వాత బ్రేక్ తీసుకున్నాడు బాల‌య్య‌. 100 సినిమాలు దాటిన త‌ర్వాత ఎవ‌రైనా కాస్త బ్రేక్ తీసుకుంటారు. కానీ బాల‌య్య మాత్రం నో బ్రేక్ అన్నాడు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విడుద‌లైన త‌ర్వాత పైసావసూల్ ను సెప్టెంబ‌ర్ లోపు తీసుకొచ్చాడు. ఆ మ‌రుస‌టి రోజే జై సింహాను మొద‌లుపెట్టి ఈ పండ‌క్కి దించేసాడు. వీటిలో పైసావ‌సూల్ ఫ్లాప్ అయినా.. జై సింహా మాత్రం ఏడాది తొలి హిట్ గా నిలిచింది. అయితే సినిమాల ప‌రంగా ఎలాఉన్నా..  ఫిజిక్ ప‌రంగా మాత్రం ఈ మ‌ధ్య బాల‌య్య‌పై కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏంటి ఈయ‌న ఇంత‌గా లావ‌య్యారు అనే క‌మెంట్సే వ‌చ్చాయి. అయితే ఎంత లావు అయినా కూడా అభిమానుల‌కు ఏం కావాలో ప‌ర్ ఫెక్ట్ గా బాల‌య్య‌కు తెలుసు. అందుకే ఎంత క‌ష్టానికైనా వెన‌కాడరు ఈయ‌న‌. ఈ మ‌ధ్యే ఓ షూట్లో గాయ‌ప‌డిన బాల‌య్య.. భుజానికి దెబ్బ తగిలించుకుని స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నారు.
బాల‌య్య ప్ర‌స్తుతం ఇంకే ప‌ని పెట్టుకోలేదు. తండ్రి బ‌యోపిక్ కోసం సిద్ధం కావ‌డం త‌ప్ప‌. ఆగ‌స్ట్ లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఆ లోపు 15 కేజీలు తగ్గ‌బోతున్నారు బాల‌య్య‌. ఇందులో ఏకంగా 62 గెట‌ప్పుల్లో బాల‌య్య క‌నిపించ‌బోతున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తో పాటు బోయ‌పాటి శీను సినిమా సైతం చేస్తున్నాడు బాల‌య్య‌. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఇందులో కూడా కొత్త‌గా క‌నిపించ‌బోతున్నాడు నంద‌మూరి న‌ట‌సింహం. ఇందులో పాత్ర కోసం కూడా బ‌రువు త‌గ్గ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌. ఈ రెండు సినిమాల్లో పూర్తిగా కొత్త బాల‌య్య‌ను ప్రేక్ష‌కులు చూస్తారంటున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతానికి మ‌రో నాలుగు నెల‌లు పాటు ఖాళీగానే ఉండ‌బోతున్నాడు బాల‌య్య‌. అప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా కూడా చేయ‌డం లేదు. ఆగ‌స్ట్ లో అన్న‌గారి బ‌యోపిక్ ప‌ట్టాలెక్క‌నుంది. మ‌రి చూడాలిక‌.. బ‌రువు త‌గ్గిన బాల‌య్య ఎలా ఉండబోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here