బాహుబ‌లి ఛ‌లో పాకిస్థాన్..

Baahubali 2
అవును.. ఇప్ప‌టికే బాహుబ‌లి ప్ర‌పంచం మొత్తం తిరిగేసాడు. ఒక్క తెలుగు సినిమాగా మొద‌లై.. ఇండియ‌న్ మూవీగా మారి.. ఇండియాకు తెలుగు సినిమా స‌త్తాను.. ప్ర‌పంచానికి ఇండియ‌న్ సినిమా స‌త్తాను చూపించింది బాహుబ‌లి. ఇక రాజ‌మౌళి అయితే ఈ చిత్రంతో నెంబ‌ర్ వ‌న్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్ గా మారిపోయాడు. ఇప్పుడు ఈక్వెష‌న్ చాలా సింపుల్.. ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ అనిపించుకోవాలంటే బాహుబ‌లిని కొట్టే సినిమా తీస్తే చాలు. అలా చాలా మంది ద‌ర్శ‌కులు పాటు ప‌డుతున్నారు ఇప్పుడు. బాహుబ‌లి విడుద‌లై ఏడాది గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ఈ చిత్ర రికార్డులు మాత్రం ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే ఎన్నో ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో బాహుబ‌లిని ప్ర‌ద‌ర్శించారు. రాజ‌మౌళితో పాటు నిర్మాత‌లు కూడా అక్క‌డే తిరిగొచ్చారు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ నుంచి కూడా ఆహ్వానం అందింది ఈ చిత్రానికి. ఇది నిజం.. స్వ‌యంగా రాజ‌మౌళే ఈ విష‌యాన్ని చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. ఇన్నేళ్లు ఇన్ని దేశాల నుంచి ఆహ్వానాలు అందినా కూడా రాని సంతోషం దాయాది దేశం నుంచి అందిన‌పుడు మాత్రం వ‌చ్చింది. అదే మ‌రి కిక్ అంటే. మ‌న ప్ర‌తిభ‌ను పాకిస్థాన్ కూడా మెచ్చుకున్నపుడే క‌దా అస‌లు కిక్ అంటున్నాడు రాజ‌మౌళి. కరాచీ లో జరిగే ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది సెలబ్రిటీలు రాబోతున్నారు. మ‌న బాహుబ‌లి కూడా దీనికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే ఈ వేడుక‌కు రాజ‌మౌళి వెళ్తాడా లేదంటే నిర్మాత‌లు వెళ్తారా.. లేదంటే జ‌స్ట్ సినిమాను మాత్ర‌మే పంపిస్తారా అనేది చూడాలి. ప్ర‌స్తుతం ఈయ‌న చ‌ర‌ణ్- ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ తో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here