బిగ్ బాస్ లో అదే జ‌రుగుతుందా..?

బిగ్ బాస్ పై రోజురోజుకీ ఆస‌క్తి పెరిగిపోతుంది. మొదటి వారంతో పోలిస్తే రెండో వారం మ‌రింత‌గా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పెరిగిన‌ట్లే అనిపిస్తుంది. పైగా నాని కూడా సొంత స్టైల్లో హోస్టింగ్ ఇర‌గ‌దీస్తున్నాడు. స‌భ‌కు న‌మ‌స్కారం.. ప్యాక‌ప్ అంటూ త‌న‌దైన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్.

అయితే అన్నీ బాగానే ఉన్నా ఒక్క కంప్లైంట్ మాత్రం బిగ్ బాస్ 2పై ఉందిప్పుడు. ఇందులో కామ‌న‌ర్స్ ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నారనే ప్ర‌చారం జ‌రుగుతుంది. తొలివారం ఎలిమినేట్ అయిన సంజ‌న ముందే చెప్పేసింది.. వ‌చ్చే వారం నూత‌న్ నాయుడు వ‌చ్చేస్తాడ‌ని. ఆమె చెప్పిన‌ట్లుగానే రెండో వారం నూత‌న్ బ‌య‌టికి వ‌చ్చేసాడు.

కౌశ‌ల్ బ‌య‌టికి వ‌స్తాడేమో అనుకున్నాం కానీ చివ‌రి నిమిషంలో అంతా మారిపోయింది అని నానినే చెప్పాడు. ఇక ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే వ‌చ్చే వారం బ‌య‌టికి వ‌చ్చేది గ‌ణేష్ అని అర్థ‌మైపోతుంది. ఆయ‌న గానీ వ‌చ్చేస్తే నిజంగానే బిగ్ బాస్ 2లో కామ‌నర్స్ ను టార్గెట్ చేసార‌నే మాట నిజం అవుతుంది. అలా కాకూడ‌దంటే క‌చ్చితంగా సెలెబ్రెటీని బ‌య‌టికి పంప‌క త‌ప్ప‌దు. అలా కాకుండా గ‌ణేష్ కానీ బ‌య‌టికి వ‌స్తే అదే నిజ‌మ‌వుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ గండం నుంచి నాని ఎలా త‌ప్పించుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here