బ‌న్నీ వార‌సుడిగా మ‌హేశ్ బాబు..!


అదేంటి.. అల్లుఅర్జున్ వార‌సుడిగా మ‌హేశ్ బాబు ఎలా సాధ్యం..? అస‌లు ఎక్క‌డ ఈ ఇద్ద‌రికి లింక్ కుదిరింది అనుకుంటున్నారా..? ఒక్క విష‌యంలో బ‌న్నీకి పోటీగా వెళ్తున్నాడు మ‌హేశ్ బాబు. ఈయ‌న సినిమాలు వ‌ర‌స‌గా ఇప్పుడు స‌మ్మ‌ర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఒక‌ప్పుడు స‌మ్మ‌ర్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోని మ‌హేశ్ బాబు.. ఇప్పుడు మాత్రం అదే కావాలంటున్నాడు.
సాధారణంగా తెలుగులో స‌మ్మ‌ర్ సీజ‌న్ అంటే వెంట‌నే గుర్తొచ్చే పేరు బ‌న్నీ. ఈ హీరో గ‌త కొన్నేళ్లుగా వేస‌విలోనే వ‌స్తున్నాడు. రేసుగుర్రం నుంచి స‌మ్మ‌ర్ క‌లిసొచ్చింది బ‌న్నీకి. ఆ త‌ర్వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. స‌రైనోడు.. డిజేతో క‌లెక్ష‌న్లు కుమ్మేసాడు ఈ హీరో. కానీ ఈ ఏడాది నా పేరు సూర్య షాకిచ్చింది. అయితే ఇదే స‌మ‌యంలో భ‌ర‌త్ అనే నేనుతో మ‌హేశ్ బాగానే వ‌సూలు చేసాడు. దాంతో వ‌చ్చే ఏడాది కూడా స‌మ్మ‌ర్ లోనే రావాల‌నుకుంటున్నాడు.
వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఎప్రిల్ 5.. 2019న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వినీదత్. మ‌హేశ్ కెరీర్ లో ఎప్రిల్ బాగానే క‌లిసొచ్చింది. 12 ఏళ్ల కింద పోకిరి ఎప్రిల్ 28న.. ఈ ఏడాది ఎప్రిల్ 20న భ‌ర‌త్ అనే నేను విడుద‌లై మంచి వ‌సూళ్లు సాధించాయి. దాంతో వంశీ సినిమా కూడా ఎప్రిల్ 5న వచ్చి సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు సూప‌ర్ స్టార్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మ‌హేశ్ యుఎస్ నుంచి వ‌చ్చిన కార్పోరేట్ కంపెనీ సిఈఓగా న‌టించ‌బోతున్నాడు. రైతుల స‌మ‌స్య‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here