ముఖ్య‌మంత్రి పాత్ర‌లో రానా ద‌గ్గుపాటి..

Rana Tej 1971 War Film

రానా జోరు ఇప్పుడు మామూలుగా లేదు. ఈయ‌న చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే ఇప్పుడు. ఎందుకంటే ఒక్క భాష‌తో స‌రి పెట్టుకోవ‌డం లేదు ఈ హీరో. వ‌ర‌స‌గా అన్ని భాష‌ల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ న‌టిస్తున్నాడు రానా. ప్ర‌స్తుతం ఈయ‌న‌ ద్విభాషా చిత్రం అరణ్య షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత మ‌రో మూడు సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి.

అయితే ఇవ‌న్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు ఈ హీరో. ఇందులో నారా చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో రానా న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు క్రిష్ తో ఉన్న అనుబంధంతో ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు రానా. ఎన్టీఆర్ జీవితంలో చంద్ర‌బాబు పాత్ర కీల‌క‌మైంది. అందుకే ఈ పాత్ర కోసం త‌న‌ను తాను మార్చుకుంటున్నాడు ద‌గ్గుపాటి వార‌సుడు. ఎలా ఉండాలో ఇప్ప‌ట్నుంచే ఆ పాత్ర‌ను ఆక‌ళింపు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా క్రిష్ ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పాత్ర వివ‌రాల‌ను అడిగి తెలుసుకుంటున్నాడు క్రిష్‌. మ‌రి చూడాలిక‌.. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ఎలా న‌టించ బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here