రంగ‌స్థ‌లం.. మ‌న‌సు క‌ద‌ల‌డం ఖాయం..

Interesting update on rangasthalam
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. దానికి కార‌ణం ఆ సినిమా పోస్ట‌ర్స్.. అందులో ఉన్న ఫీల్.. మ‌న‌సును క‌దిలిస్తుందేమో అనేంత‌గా పోస్ట‌ర్స్ లోనే కావాల్సినంత లైవ్లీనెస్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. అదే రంగ‌స్థ‌లం. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ చూసిన త‌ర్వాత రంగ‌స్థ‌లంలో ఎంత విష‌యం ఉందో అర్థ‌మైపోతుంది. ఆ ఫ‌స్ట్ లుక్ లోనే కావాల్సినంత క‌థ చెప్పేసాడు ఈ ద‌ర్శ‌కుడు. అందులో చ‌ర‌ణ్ ఎర్ర బ‌నియ‌న్ వేసుకుంటాడు.. అంటే అత‌డు డైలీ లేబ‌ర్.. పైగా అత‌డికి చెవులు విన‌బ‌డ‌వు.. త‌ల‌పై మొక్క‌జొన్న మోస్తూ కాస్త వింత‌గా చూస్తుంటాడు. ఆ పోస్ట‌ర్ లోనే కావాల్సినంత అమాయ‌క‌త్వం క‌నిపిస్తుంది. ఇలా రంగ‌స్థ‌లం చాలా వెరైటీగా ఉండ‌బోతుంది. ఈ చిత్రం క‌చ్చితంగా చ‌ర‌ణ్ కెరీర్ లోనే మైలురాయిగా మిగిలిపోతుందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
మ‌నమంతా మెకానిక‌ల్ లైఫ్ లో ప‌డిపోయాం.. బంధాలు అనుబంధాలు ఇప్ప‌టికీ ఉన్నాయి.. కానీ ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు అలా లేవు. ఇది మ‌న మ‌న‌సు కూడా ఒప్పుకోవాల్సిన నిజం. కాస్త వెన‌క్కి వెళ్లి చూసుకుంటే ఆ రోజుల్లో అన్నీ ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా మారాయి అనేది మ‌న‌కే అర్థ‌మైపోతుంది. ఇప్పుడు రంగ‌స్థ‌లం సినిమా కూడా స‌రిగ్గా ఇదే నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్. ఇందులో రామ్ చ‌ర‌ణ్ పాత్ర గురించి ఇప్ప‌టికే సుక్కు చాలా చెప్పాడు. ఇప్పుడు నిజంగానే అది కంటికి క‌నిపిస్తుంది. రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ చాలా న్యాచుర‌ల్ గా ఉన్నాడు. ఈ చిత్రంతో న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. విడుద‌లవుతున్న స్టిల్స్ చూస్తుంటే చ‌ర‌ణ్ ఎంత న్యాచుర‌ల్ గా ఉన్నాడో అర్థ‌మైపో తుంది.
80వ ద‌శ‌కంలో ఫేమ‌స్ అయిన పీచు మిఠాయి.. గోలీసోడా.. గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్.. అప్ప‌ట్లో ఉండే షాపులు.. జాత‌ర‌.. అక్క‌డ రంగుల‌రాట్నం.. ఇవ‌న్నీ ఫోటోలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. పైగా ఈ సెట్ లో ఉన్న చాలా వ‌స్తువుల‌ను పోల‌వ‌రం ముంపు ప్రాంతాల్లో పోయిన గ్రామాల్లోంచి కొనుక్కుని తీసుకొచ్చారు. అందుకే చాలా న్యాచుర‌ల్ గా రంగ‌స్థ‌లం సిద్ధ‌మ‌వుతుంది. ఈ చిత్ర ఫ‌లితంపై కావాల్సినంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మెగా వార‌సుడు క‌చ్చితంగా రంగ‌స్థ‌లంతో తాను బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయ‌మంటున్నాడు. మార్చ్ 30, 2018లో సినిమా విడుద‌ల కానుంది ఈ చిత్రం. మొత్తానికి త‌న సినిమాతో ప్రేక్ష‌కులను మాయ చేయాల‌ని ఫిక్సైపోయాడు సుకుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here