రేణు.. ప‌వ‌న్ ని ఎందుకు టార్గెట్ చేసిన‌ట్లు..?

ఎప్పుడు చూసినా త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి అని.. అలాంటి వ్య‌క్తికి దూరం కావ‌డం త‌న దుర‌దృష్టం అని చెబుతుంటుంది రేణుదేశాయ్. ఇద్ద‌రి మ‌ధ్య ఇత‌ర కార‌ణాల వ‌ల్ల విడిపోయామే కానీ గొడ‌వ‌ల‌తో కాదు అని చాలాసార్లు చెప్పింది రేణు. ఇక ఈమెతో విడిపోయిన త‌ర్వాత ప‌వ‌న్ మ‌రో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రేణుదేశాయ్ కూడా మ‌రో పెళ్లి చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రేణు పెళ్లికి ప‌వ‌న్ కూడా విష‌శ్రీ‌స్ తెలిపాడు. మీ కొత్త జీవితానికి అంతా మంచి జ‌ర‌గాల‌ని.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా రేణు గారు అంటూ ట్వీట్ చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే ప‌వ‌న్ కు త‌గిలేలా మాత్రం రేణుదేశాయ్ మాత్రం కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. త‌న‌కు కాబోయే వాడి వివరాలు బ‌య‌టికి చెప్ప‌లేదు రేణుదేశాయ్. త‌ను సంపాదిస్తున్నాను.. త‌న‌కు కాబోయే భ‌ర్త కూడా బాగానే సంపాదిస్తున్నాడు.. ఇప్పుడిద్ద‌రం హ్యాపీగా ఉంటాం..

లివింగ్ రిలేష‌న్ షిప్ లో ఉండొచ్చు కానీ ఆల్రెడీ ఓసారి ఆ త‌ప్పు చేసాన‌ని ఇంక మ‌రోసారి అలాంటి త‌ప్పు చేయ‌న‌ని చెప్పింది రేణు. ఒక సారి తాను తప్పనిసరి పరిస్థితుల్లో సహజీవనంలో ఉన్నానని.. కానీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేయ‌న‌ని చెప్పింది ఈమె. తనకు వివాహ వ్యవస్థ మీద ఎంతో నమ్మకముందని ఆమె చెప్పింది.

ఈ మాట‌లు ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు నేరుగానే త‌గులుతున్నాయి. ప‌వ‌న్ ను టార్గెట్ చేసి ఈ మాట‌లు రేణు అన్న‌దంటూ వార్త‌లొస్తున్నాయి. తన ఎంగేజ్మెంట్ నేపథ్యంలో తమ వ్యక్తిగత.. వృత్తిగత జీవితాల్లో అసంతృప్తితో ఉన్న వాళ్ళే త‌న‌కు నెగిటివ్ మెసేజ్ లు పెట్టార‌ని.. చాలా మంది మాత్రం త‌న పెళ్లిపై సంతోషాన్ని వ్య‌క్తం చేసార‌ని చెప్పుకొచ్చింది రేణుదేశాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here