రేస్ 3.. ప‌డిందిగా పెద్ద పంచ్..!

మూడు రోజుల్లోనే 106 కోట్లు వ‌చ్చేస‌రికి రేస్ 3 బాలేక‌పోయినా కూడా నిల‌బ‌డిపోయింద‌ని అనుకున్నారంతా. కానీ ఒక్క రోజులోనే సీన్ అంతా మారిపోయింది. రంజాన్ సీజ‌న్ కావ‌డం.. పైగా హాలీడేస్ కావ‌డంతో మూడు రోజులు కుమ్మేసింది రేస్ 3. కానీ అస‌లైన నాలుగో రోజు..

సోమ‌వారం చ‌తికిల‌ప‌డింది. ఆదివారం రోజు 39 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన ఈ చిత్రం నాలుగో రోజు ఏకంగా 14 కోట్ల‌కు ప‌డిపోయింది. హిట్ సినిమాకు నాలుగో రోజు కూడా క‌నీసం 20 కోట్లైనా వ‌స్తాయి. కానీ రేస్ 3లో విష‌యం లేద‌ని ప్రేక్ష‌కుల‌కు కూడా అర్ధ‌మైపోయింది. అందుకే మూడు రోజులు నెత్తిన పెట్టు కున్నా నాలుగో రోజు మాత్రం తీసి పారేసారు.

అప్ప‌ట్లో భ‌జ‌రంగీ భాయీజాన్.. టైగ‌ర్ జిందా హై లాంటి సినిమాలు వీక్ డేస్ లోనూ కుమ్మేసాయి. కానీ ఇప్పుడు రేస్ 3కి అలాంటి రోజులు క‌నిపించేలా లేవు. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 300 కోట్లు రావాలి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అది అంత సుల‌భం కాదేమో అనిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. స‌ల్మాన్ త‌న స్టామినాతో ఇంకెంత దూరం తీసుకెళ్తాడో ఈ చిత్రాన్ని..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here