వామ్మో.. నాగార్జున మామూలోడు కాదు..

Hello Audio Launch Photos
ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌ర్ ఫెక్ట్ బిజినెస్ మెన్ లో నాగార్జున నెంబ‌ర్ వ‌న్. ఈయ‌న ఎప్పుడు ఏం చేసినా.. అది ఎక్క‌డో ఎప్పుడో ఏదో విధంగా త‌న‌కు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు హ‌లో ఆడియో వేడుక‌లోనూ మ‌రోసారి త‌న తెలివితేట‌ల్ని చూపించాడు నాగ్. ఈ చిత్ర ఆడియో వేడుక‌లో అభిమానుల సాక్షిగా విక్ర‌మ్ కే కుమార్ ను బుక్ చేసాడు మ‌న్మ‌థుడు. ఈయ‌న తీరు చూస్తుంటే విక్ర‌మ్ ను అక్కినేని కంపౌండ్ దాటి బ‌య‌టికి వెళ్లనిచ్చేలా క‌నిపించ‌ట్లేదు. వ‌ర‌స‌గా త‌న కుమారులతోనే సినిమాలు చేయించేలా ఉన్నాడు. మ‌నం లాంటి క్లాసిక్ సినిమాను అక్కినేని కుటుంబానికి ఇచ్చాడు విక్ర‌మ్ కే కుమార్. అందుకే ఇప్ప‌టికీ ఆయ‌న్ని దేవుడిలా చూస్తున్నాడు నాగ్. ఈయ‌న కెరీర్ లో ఇప్ప‌టికే 13 బి.. 24.. మ‌నం.. ఇష్క్ లాంటి క్లాస్ సినిమాలున్నాయి. ఇప్పుడు ఈయ‌న హ‌లో సినిమాతో వ‌స్తున్నాడు.
కాంప్లికేటెడ్ క‌థ‌ల్ని కూడా కామ‌న్ పీపుల్ కు అర్థ‌మ‌య్యే స్క్రీన్ ప్లేతో విక్ర‌మ్ వండ‌ర్స్ చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఏదో ఓ అల్లాట‌ప్పా సినిమాలు కాకుండా ఇండియ‌న్ సినిమా రేంజ్ ను పెంచే విధంగా విక్ర‌మ్ సినిమాలు ముందుకు వెళ్తున్నాయి. మ‌నం సినిమా తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ క్లాసిక్. 24 కూడా ఇండియ‌న్ స్క్రీన్ పై ఇది వ‌ర‌కు చూడ‌న‌టువంటి ఓ అద్భ‌తుమైన సైన్స్ ఫిక్ష‌న్. ఇప్పుడు హ‌లో కూడా ప్రేమ‌క‌థ‌కే త‌న టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే జోడించాడు విక్ర‌మ్ కుమార్. అందుకే అక్కినేని కంపౌండ్ దాట‌నివ్వ‌డం లేదు ఈ ద‌ర్శ‌కున్ని నాగార్జున‌. ఈయ‌న త‌ర్వాతి సినిమా కూడా నాగచైత‌న్య‌తోనే ఉండ‌బోతుంద‌ని హ‌లో ఆడియో వేడుక‌లో అభిమానుల సాక్షిగా చెప్పాడు నాగ్. మొత్తానికి హ‌లో కానీ హిట్టైతే మ‌రో రెండు మూడేళ్ల పాటు అక్కినేని కంపౌండ్ లోనే విక్ర‌మ్ ను హౌజ్ అరెస్ట్ చేస్తాడేమో నాగార్జున‌..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here