శంభో శంక‌ర‌.. ఏంటో ఈ అరాచ‌కం..?


క‌మెడియ‌న్లు హీరోలుగా మార‌డం ఎప్ప‌ట్నుంచో వ‌స్తున్న ఆన‌వాయితీ. కానీ హీరోగా మారాలంటే ముందు స్టార్ క‌మెడియ‌న్ అయ్యుండాలి. అప్పుడే క‌నీసం ఆయన్ని చూడ్డానికి ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు వ‌స్తారు. కానీ స్టార్ క‌మెడియ‌న్ అనే మాట రాక‌ముందే జ‌స్ట్ జ‌బ‌ర్ద‌స్థ్ షోతో పాపుల‌ర్ అయి వెంట‌నే హీరోగా న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్పుడు శంక‌ర్ ఇదే చేసాడు. ఈయ‌న న‌టించిన శంభో శంక‌ర విడుద‌లైంది.
ఊహిం చిన‌ట్లుగానే సినిమాకు టాక్ తేడాగానే వ‌చ్చింది. అయితే శంక‌ర్ మాత్రం బాగా చేసాడ‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. కానీ సినిమా హిట్ అవ్వాలంటే అది స‌రిపోదు క‌దా.. దానికి మించి సినిమాలో త‌న యాక్టింగ్ కాకుండా ప‌వ‌న్ ను దించేయ‌డం మాత్రం రుచించ‌డం లేదు. ప‌వ‌న్ ఉన్న‌పుడు అలా చేస్తే ఇంక లాభం ఏం ఉంది..? నీలా నువ్వు చేసిన‌పుడే క‌దా.. సొంత గుర్తింపు వ‌చ్చేదంటున్నారు విమ‌ర్శ‌కులు.
ఇందులో చెప్పుకోడానికి కొత్త క‌థేం లేదు కానీ ఈయ‌న మాత్రం పూర్తిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇమిటేట్ చేసాడు. పైగా మెడ‌లో ఎర్ర ట‌వ‌ల్ వేసుకుని ప‌వ‌న్ భ‌జ‌న చేసేసాడు. తొలిరోజే త‌మ సినిమాకు 2 కోట్ల 55 ల‌క్ష‌లు గ్రాస్ వ‌చ్చింద‌ని నిర్మాత‌లు వేసుకున్నారు కానీ నిజానికి 50 ల‌క్ష‌ల షేర్ కూడా రాలేద‌ని తెలుస్తుంది. మొత్తానికి సొంత డ‌బ్బా బాగానే కొట్టుకుంటున్నా.. ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డుతుందో తెలియాలంటే మ‌రో వారం రోజులు ఆగాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here