శృతిహాస‌న్.. కేఫ్ సుంద‌రి..!


అదేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు సినిమాలు లేక‌పోయేస‌రికి ఇదే ప‌ని మీద బిజీగా ఉంది శృతిహాస‌న్. ఎప్పుడు చూసినా చెన్నైలోని టాప్ కేఫెల చుట్టూ తిరిగేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ‌. అది కూడా ఫుల్ గా గ్లామ‌ర్ షో చేస్తూ. ఇప్పుడు కూడా వీకెండ్ పార్టీ అంటూ చిట్టిపొట్టి బ‌ట్ట‌ల‌తో హాట్ షో చేస్తూ ఓ కేఫ్ నుంచి బ‌య‌టికి వ‌స్తూ సూప‌ర్ పోజ్ ఇచ్చింది శృతిహాస‌న్.
సినిమాల‌కు పూర్తిగా దూరమైన శృతి.. ఫిజిక్ పై కూడా ప‌ట్టు కోల్పోయింది. బాగా బ‌రువు పెరిగిపోయి ఔట్ ఆఫ్ షేప్ లోకి వ‌చ్చేసింది. ఈ మ‌ధ్య చేసిన ఓ ఫోటోషూట్ లో కూడా లావుగానే క‌నిపించింది శృతి. ప్ర‌స్తుతం హిందీలో విద్యుత్ జ‌మాల్ సినిమా త‌ప్ప మ‌రో సినిమా ఏది సైన్ చేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించాల‌ని కోరినా ఒప్పుకోలేదు శృతి.
అయితే త్వ‌ర‌లోనే తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చే స‌న్నాహాలు చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ ఫోటోషూట్ దానికి స‌న్నాహ‌కంగా కూడా అయ్యుండొచ్చు మ‌రి. మ‌రోవైపు తండ్రి రాజ‌కీయ పార్టీ ప‌నుల‌ను కూడా ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది శృతి. మ‌రి ఒకేసారి ఇన్ని ప‌నుల‌ను శృతి ఎలా చ‌క్క‌బెట్టుకుంటుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here