శ్రీ‌దేవి రుణం తీర్చుకుంటున్న రాజ‌మౌళి..


అదేంటి చ‌నిపోయిన శ్రీ‌దేవి రుణం రాజ‌మౌళి ఎలా తీర్చుకుంటాడు..? అస‌లు ఏ విష‌యంలో ఈమెకు జ‌క్క‌న రుణ‌ప‌డ్డాడు అనుకుంటున్నారా..? అది రుణ‌మో మ‌రి ఏంటో తెలియ‌దు కానీ అనుకోకుండా అప్పుడు శ్రీ‌దేవితో కొన్ని విభేదాలు వ‌చ్చాయి ఈ ద‌ర్శ‌కుడికి. త‌న‌కు తెలియ‌కుండానే ఆమె దృష్టిలో చిన్న‌సైజ్ విల‌న్ అయిపోయాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర‌కు ముందు శ్రీ‌దేవినే తీసుకుని..
ఆ త‌ర్వాత అనుకోకుండా ర‌మ్య‌కృష్ణ‌ను తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. శ్రీ‌దేవితో ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాతైనా ప‌ని చేస్తాన‌ని చెప్పాడు రాజ‌మౌళి. కానీ అంత‌లోనే ఆమె క‌న్నుమూసింది. ఇప్పుడు శ్రీదేవి రుణం ఆమె కూతురు ఝాన్వీక‌పూర్ తో తీర్చుకుంటున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.
ఈయ‌న త‌న మ‌ల్టీస్టార‌ర్ లో ఝాన్వీకి అవ‌కాశం ఇస్తున్నాడ‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా రానున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఇందులో కీర్తిసురేష్ ను ఓ హీరోయిన్ గా తీసుకున్న రాజ‌మౌళి.. మ‌రో హీరోయిన్ గా ఝాన్వీ వైపు అడుగేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికైతే ఝాన్వీ క‌పూర్ ఎంపిక‌పై ఎలాంటి వార్త‌లు లేవు కానీ శ్రీ‌దేవితో మిస్ అయిన అవ‌కాశం ఇప్పుడు ఆమె వార‌సురాలికి ఇవ్వాల‌ని చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఒక‌వేళ ఇదే కానీ నిజ‌మైతే ఝాన్వీ కెరీర్ ఒక్క‌సారిగా టాప్ లెవ‌ల్ కు వెళ్లిపోయిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here