శ్రీ‌నివాస క‌ళ్యాణం ఫ‌స్ట్ టాక్..

SRINIVASA KALYANAM FIRST TALK
ఎన్నో అంచ‌నాలు.. మ‌రెంతో ఆస‌క్తి మ‌ధ్య శ్రీ‌నివాస క‌ళ్యాణం విడుద‌లైంది. ఇండియాలో ఇంకాస్త టైమ్ ఉన్నా.. ఓవ‌ర్సీస్ లో మాత్రం షోలు ప‌డిపోయాయి. అక్క‌డ్నుంచి వ‌చ్చిన టాక్ ను బ‌ట్టి చూస్తుంటే మ‌రోసారి దిల్ రాజు సంచ‌ల‌నం దిశ‌గా అడుగేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. స‌తీష్ వేగేశ్న కూడా మ‌రో హిట్ ఖాతాలో వేసుకోనున్నాడు. తెలుగింటి బంధాలు అనుబంధాల గురించి అందంగా చెప్పి తెర‌పై క‌న్నుల పండ‌గ‌గా ఈ సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా.. తెలిసిన క‌థ‌నే అందంగా చెప్పాడంటున్నారు ప్రేక్ష‌కులు.
ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాకు బ్ర‌హ్మ‌రథం ప‌ట్ట‌డం ఖాయం అయిపోయింది. ఇంక ఇండియాలో టాక్ కోసం వేచి చూస్తున్నారు దిల్ రాజు అండ్ బ్యాచ్. లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగా డిజాస్ట‌ర్స్ త‌ర్వాత వ‌చ్చిన సినిమా కావ‌డంతో నితిన్ కూడా శ్రీ‌నివాస క‌ళ్యాణం కోసం వేచి చూస్తున్నాడు. చూస్తుంటే ఈ హీరో ఎదురుచూపులు తీరి.. హిట్ కొట్టేలా ఉన్నాడు. 20 రోజుల కింద ల‌వ‌ర్ తో డిజాస్ట‌ర్ అందుకున్న దిల్ రాజు.. మ‌రోసారి హిట్ ట్రాక్ ఎక్కుతున్నాడు. ఇప్పుడు స‌తీష్ వేగేశ్న‌కు క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయమిక‌. అయితే సినిమా ఎంత బాగున్నా కూడా 30 కోట్ల‌కు పైగా వ‌స్తే కానీ శ్రీ‌నివాస క‌ళ్యాణం హిట్ అనిపించుకోదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here