సచివాలయం కట్టలేకపోయినవారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా?

 

ప్రముఖ నటుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దుమ్ము దులిపారు పోలవరం లో అవినీతి జరుగుతుంది అని ఈ అవినీతి వల్ల పోలవరం పూర్తికావడం లేదు అని అభిప్రాయపడ్డారు. సచివాలయం కట్టలేకపోయినవారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తనకు పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేదని, అందువల్లే దాని గురించి తెలుసుకోవాలని వచ్చానని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన సర్ ఆర్దర్ కాటన్ సమయం నుంచి ఉన్నా,ఇంతవరకు పూర్తి కాలేదని ఆయన అన్నారు. పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో.. ఏ ఒక్క పార్టీదో కాదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంత లాభం, ఎంత నష్టం అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకుని నిర్మాణం సాగుతున్నా అడుగడుగునా అడ్డంకులు పడుతూనే ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం యాభై కోట్లకు దాటిందని ఆయన అన్నారు.2019నాటికి పోలవరం పూర్తి కాదని ఆయన అబిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here