స్యామ్ వ‌చ్చింది.. చై లైఫ్ మారింది..

పెళ్లికి ముందు.. త‌ర్వాత జీవితాలు మారిపోతాయంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు చైతూ స‌మంత‌ను చూస్తుంటే నిజ‌మే అనిపిస్తుంది. పెళ్లి త‌ర్వాత కూడా స్యామ్ పెద్ద‌గా మార‌లేదు. ఇప్ప‌టికీ అదే క్రేజ్ ఉంది. అప్ప‌ట్నుంచి ఉన్న‌ట్లే ఇప్పుడు యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌.
సినిమాల విష‌యంలోనూ స‌మంత దూసుకుపోతుంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య కెరీర్ కూడా స‌మంత వ‌చ్చిన త‌ర్వాత మారిపోయింది. సినిమాల విష‌యంలో స్యామ్ తో పోటీ ప‌డుతున్నాడు కానీ యాడ్స్ విష‌యంలో మాత్రం వెన‌కే ఉండేవాడు చై. కానీ స్యామ్ వ‌చ్చిన త‌ర్వాత ఈయ‌న‌కు కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ జంట‌తో యాడ్ ఫిల్మ్స్ కోసం మేక‌ర్స్ ఎగ‌బ‌డుతున్నారు.
రియ‌ల్ లైఫ్ క‌పుల్ కావ‌డంతో ఇద్ద‌రితో ఎండోర్స్ మెంట్ చేయిస్తే జ‌నానికి ఇంకా బాగా రీచ్ అవుతుంద‌ని భావిస్తున్నారు మేక‌ర్స్. ఇదివ‌ర‌కే ఓ రెండు మూడు యాడ్స్ చేసిన ఈ జంట‌.. ఇప్పుడు రెక్సోనాకు కూడా పోజ్ ఇచ్చారు. ఇది చూస్తుంటే రాబోయే కాలంలో కూడా క్రేజీ క‌పుల్ గా తెలుగు యాడ్ వ‌రల్డ్ లో సంచ‌ల‌నాలు సృష్టించేలా ఉన్నారు ఈ జోడీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here