చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. ఇప్పటికే ఈయన కథ కూడా సిద్ధం చేస్తున్నాడు. డిసెంబర్ నాటికి కథ అంతా పూర్తి కానుంది. మరోసారి సోషల్ మెసేజ్ ఉన్న కథనే రెడీ చేసాడు కొరటాల. పైగా చిరంజీవికి కూడా ఈయన చెప్పిన కథ చాలా బాగా నచ్చేసరికి మరో మాట లేకుండా సినిమా చేసేద్ధాం అని పచ్చజెండా ఊపేసాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో క్యాస్టింగ్ పై దృష్టి పెట్టాడు కొరటాల శివ. ఇందులో హీరోయిన్ గా అనుష్కను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ దర్శకుడు. తన తొలి సినిమా మిర్చిలో అనుష్కే హీరోయిన్.
ఇక ఇప్పుడు చిరంజీవికి కూడా జోడీగా జేజమ్మనే తీసుకోవాలని చూస్తున్నాడు కొరటాల. పైగా చిరు కూడా అనుష్కతో జోడీ కట్టాలని చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నాడు. ఖైదీ నెం.150 కోసం అనుష్కను అనుకున్నా అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు మాత్రం అనుష్కకు కూడా మరో సినిమాలేవీ లేవు. దాంతో కొరటాల ఆఫర్ కు మరో మాట లేకుండా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ప్రకటన రానుంది. గతంలో స్టాలిన్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది అనుష్క. ఇప్పుడు హీరోయిన్ గా జోడీ కట్టబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కొరటాల-చిరు సినిమా పట్టాలెక్కనుంది.