ధ‌డ‌క్.. ట్రైల‌ర్ ఫుల్ క‌ల‌ర్ ఫుల్..!

వ‌చ్చేసింది.. ఝాన్వీ న‌టించిన తొలి సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఈ భామ ఎలా ఉంటుంది..? శ్రీ‌దేవి కూతురు తెర‌పై ఎలా న‌టించింది అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌చ్చేసింది. అతిలోక‌సుంద‌రి న‌ట వార‌సురాలిగా త‌న తొలి సినిమాలో బాగానే స్క్రీన్ ప్ర‌జెన్స్ ఇచ్చింది ఝాన్వీ. అందంతో పాటు అభిన‌యం చూపించింది. ట్రైల‌ర్ నిండా ఝాన్వీనే బాగా హైలైట్ చేసారు. అప్ప‌ట్లో శ్రీ‌దేవి ఉన్న‌పుడు అన్నీ తాను చూసుకున్న త‌ర్వాత కానీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

మ‌రాఠీలో సూప‌ర్ హిట్ అయిన సైరాత్ సినిమాకు రీమేక్ ఇది. శ‌శాంక్ కైథాన్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాతో ఇషాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. సైరాత్ చూసిన వాళ్ల‌కు కూడా ఈ చిత్రం కొత్త‌గా అనిపిస్తుంది. శ్రీ‌దేవి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని త‌న కూతుర్ని క‌ర‌ణ్ జోహార్ చేతుల్లో పెట్టింది.

పాపం ఆ సినిమా చూడ‌కుండానే ఆమె పైకి వెళ్లిపోయింది. అయితే జాన్వి ప‌రిచ‌యానికి సైరాత్ సరైన సినిమా కాదేమో అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లు సైరాత్ లో అంత‌గా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏమీ లేద‌ని.. ఆ టైమ్ లో మ‌రాఠీయుల‌కు ఆ సినిమా ఎందుకో క‌నెక్ట్ అయిపోయిందంతే.. హిందీలో సైరాత్ క్లిక్ అవ్వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. కానీ ఇప్పుడు ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన విధానం చూస్తుంటే సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు ఎక్కేలా క‌నిపిస్తుంది. జులై 20న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here