సరిగ్గా రెండేళ్ల కింద అనుకుంట.. అందరికీ గుర్తుండే ఉంటుంది నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై కేసీఆర్ సర్కార్ ఎలా ఫైర్ అయిందో..? ఆ తర్వాత నానా తిప్పలు పడి దాన్ని సెట్ చేసుకున్నాడు నాగార్జున. ఇక ఇప్పుడు కన్ను చిరంజీవిపై పడింది. పడటం అంటే పగ బట్టడం కాదు కానీ ప్రభుత్వ భూముల్లో షూటింగ్ చేస్తున్నారనే అభియోగం ఇప్పుడు చిరంజీవి అండ్ కుటుంబంపై పడింది. రంగస్థలం సినిమా సెట్ వేసిన 84 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ స్థలం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది.
ఈ భూమి ఏడాదిగా మెగా హీరోల చేతుల్లోనే ఉంది. అక్కడే చరణ్ సినిమాను సగానికి పైగా తీసారు.. ఇప్పుడు సైరా కోసం వాడుకుంటున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ప్రభుత్వ అధికారులు.. ఇప్పుడు సడన్ గా నిద్రలోంచి మేల్కొన్నారు. ఇప్పటి వరకు చూసి చూడనట్లుగానే ఉన్నాం అని.. అయితే ప్రభుత్వ భూములను మరీ ఇంతగా వాడేస్తుంటే చూస్తూ ఎలా ఉంటాం అంటూ వచ్చి సైరా సెట్ ను కూల్చేస్తున్నారు అధికారులు. వచ్చీ వెంటనే అన్నీ తొలగించాలని లేదంటే మొత్తాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు శేరిలింగంపల్లి కలెక్టర్. దీనిపై ఇంకా మెగాస్టార్ రియాక్షన్ రాలేదు. మరి చూడాలిక.. చిరు దీనిపై ఎలా స్పందిస్తారో..?