తెలుగు ఇండస్ట్రీలో సూపర్ ఫాస్ట్ గా సూపర్ స్టార్ కావడానికి అడుగులు వేస్తున్న హీరో విజయ్ దేవరకొండ. ఈయన ఇంత వేగంగా స్టార్ అవుతాడని ఎవరూ ఊహించలేదు కూడా. ఒక్కో సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు ఈ కుర్ర హీరో. ఇక ఈయన స్టైల్స్ విషయంలో కూడా అందరు హీరోల కంటే ముందున్నాడు. ట్రెండ్ ఫాలో అవ్వడంలో విజయ్ తర్వాతే ఎవరైనా. ఇన్నాళ్లూ కేవలం అల్లు అర్జున్ మాత్రమే స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. కానీ ఇప్పుడు ఆయనను తలదన్నే స్థాయిలో విజయ్ దేవరకొండ మేకోవర్ అయిపోతున్నాడు. తాజాగా ఆయన మరో ఫోటోషూట్ విడుదలైంది. ఇందులో విజయ్ మారిపోయిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అచ్చం చూడ్డానికి బాలీవుడ్ హీరోలా ఉన్నాడు విజయ్ దేవరకొండ. పూర్తిగా మేకోవర్ అయిపోయి కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు ఈ అర్జున్ రెడ్డి. ప్రస్తుతం హీరోగానే కాకుండా బిజినెస్ మాన్ గానూ దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. పైగా ఈయన మొదలుపెట్టిన రౌడీ కాస్ట్యూమ్స్ ఇప్పుడు మార్కెట్ ను దుమ్ము దులిపేస్తున్నాయి. సినిమాల పరంగా కూడా ఆయన దూకుడు మామూలుగా లేదు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతిమాధవ్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల శివ కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.