ఇప్పటివరకు ట్రైలర్ విడుదల చేయకుండానే ఎఫ్2 సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జనవరి 12న సినిమా విడుదల కానుంది. ట్రైలర్ లేకుండానే ఇంత రచ్చ చేసిన టీం.. ఇప్పుడు ఇది కూడా రిలీజ్ చేస్తున్నారు. జనవరి 7 సాయంత్రం ఎఫ్2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం ఐదు రోజుల ముందు ఈ ట్రైలర్ ను తీసుకురావడం కూడా ప్రమోషన్ లో భాగంగా కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని సంక్రాంతి సినిమాల ట్రైలర్స్ వచ్చేశాయి. ఇప్పుడు ఎఫ్2 ట్రైలర్ కొత్తగా వస్తుంది. దాంతో విడుదలయ్యే వరకు ఈ ట్రైలర్ గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారని.. ఇదే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.
వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఇందులో ఉండటంతో సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు వైపు పరుగులు తీస్తారు అని నమ్ముతున్నాడు నిర్మాత దిల్ రాజు. పైగా ఈ పండగ బాగా కలిసొచ్చింది ఈయనకు. గతంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఎవడు, శతమానం భవతి లాంటి సినిమాలు సంక్రాంతి పండక్కి వచ్చిన విజయం సాధించాయి. ఇప్పుడు ఎఫ్2 విషయంలో కూడా ఇదే జరుగుతుందని చెప్తున్నాడు దిల్ రాజు. అందుకే భారీ సినిమాలు వస్తున్నా కూడా ధైర్యంగా ఎఫ్2 సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నాడు ఈ నిర్మాత. మరి మొత్తానికి ట్రైలర్ విడుదలైన తర్వాత ఎఫ్2పై అంచనాలు ఇంకెంతగా పెరిగిపోనున్నాయో చూడాలి.