త్రివిక్రమ్ కోసం అలా మారిపోతున్న అల్లు అర్జున్..

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం కొత్త లుక్ తో కనిపించబోతున్నాడు బన్నీ. ప్రస్తుతం బాగా బరువు పెరిగిపోయి కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. దాంతో బరువు తగ్గాలని అల్లు అర్జున్ కు సూచించాడు త్రివిక్రమ్. ఇప్పుడూ ఇదే చేస్తున్నాడు బన్నీ.

త్రివిక్రమ్ సినిమా కోసం స్లిమ్ గా మారిపోతున్నాడు అల్లు అర్జున్. త్వరలోనే ఈ కొత్త లుక్ కూడా బయటకు రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ప్రియా వారియర్, రష్మిక మందన్న నటించబోతున్నారని తెలుస్తోంది. తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కబోతుంది. అరవింద సమేత సినిమాతో ఫాంలోకి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. బన్నీతో మరో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. పైగా ఈ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా కోసం జుట్టు పెంచి కొత్తగా మారిపోయాడు అల్లు అర్జున్. ఒక్కసారి పట్టాలెక్కిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here