తమన్నా పెళ్లి ప్లాన్స్ చెడగొట్టిన ఎఫ్2 సినిమా..

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజయం కోసం తమన్నా ఎదురు చూస్తూనే ఉంది. కానీ వచ్చిన సినిమా వచ్చినట్లు పోతుంది కానీ ఏది నిలబడలేదు. దాంతో ఎంచక్కా ఇంట్లో చూసిన సంబంధం చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంది తమన్నా. కానీ ఇప్పుడు ఎఫ్2 సినిమా తర్వాత పెళ్లి ప్రణాళికలు మార్చేస్తుంది తమన్నా. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పేసినట్లు క్లారిటీ ఇచ్చింది. దీనికి కారణాలు కూడా లేకపోలేవు.

ఎఫ్2 సినిమా మొత్తం పెళ్లి ఆధారంగానే తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఇందులో పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టాల గురించి.. లాభాల గురించి బేరీజు వేసి మరీ చెప్పాడు. ఇలాంటి సమయంలో తమన్నా పెళ్లికి దూరంగా ఉంటానని చెప్పడంతో అభిమానుల్లో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాలో చూపించిన విధంగా పెళ్లి అయితే జీవితాలు మారిపోతాయని భయంతో తాను పెళ్లి చేసుకోవడానికి వెనకాడటం లేదని.. కేవలం ఎఫ్2 విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని చెబుతోంది తమన్నా. ఈ సినిమా లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. దాంతో ఇప్పట్లో పెళ్లి ఆలోచన మానుకుని సినిమాలపై కాన్సన్ట్రేషన్ పెట్టింది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం సైరా సినిమాతో పాటు పాటు దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాతో బిజీగా ఉంది తమన్నా. ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే పెళ్లికి దూరంగా ఉంటుంది. మరి మీ కోరికను ఏ దర్శకుడు మన్నిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here