కేరళ తుఫాన్ బాధితుల సహయార్థం 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్

తుఫాను భీభత్సం తో అతలాకుతలం ఐన కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. ఇప్పటికే అక్కడి వరదల్లో 37 మంది చనిపోయారు. ఎడతెరిపి వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి… ఈ వార్త తెలిసిన వెంటనే అల్లు అర్జున్ స్పందించారు.

కేరళ లో అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బన్నీ నటించిన ప్రతీ చిత్రాన్ని స్ట్రెయిట్ సినిమాల మాదిరిగానే ఆదరిస్తూ వస్తున్నారు. తనను ఇన్నేళ్ళుగా ఆదరిస్తున్న కేరళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం బన్నీ ని తీవ్రంగా కలచివేసింది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఎర్నాకులం, పాలక్కాడ్, మలప్పురం, కలికట్ ప్రాంతాల్లో ఇవాల్టి వరకూ రెడ్ అలర్ట్ అమల్లో ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here