మళ్లీ నాన్నకుప్రేమతో అంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..

ఎందుకో తెలియదు కానీ తన ప్రతి సినిమాలో తండ్రి సెంటిమెంట్ బాగా వాడుకుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలియకుండానే ప్రతి కథలో కూడా తండ్రి సెంటిమెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైపోయింది. డిజాస్టర్ అయిన అజ్ఞాతవాసిలో కూడా తండ్రి సెంటిమెంట్ కనిపిస్తుంది. అరవింద సమేతలో కూడా తెలియకుండానే నాన్న సెంటిమెంట్ బలంగా చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక దానికి ముందు బన్నీతో చేసిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా మొత్తం తండ్రి చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఈ దర్శకుడు చేయబోయే సినిమాలో కూడా తండ్రి సెంటిమెంట్ కీలకపాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. మరోసారి నాన్నకు ప్రేమతో లాంటి కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.

Allu Arjun Trivikram Film Getting Delayed
నాన్నకు ప్రేమతో అంటే ఎన్టీఆర్ చేసిన సినిమా కాదు.. నాన్నకు అంకితం ఇచ్చే కథ అనమాట. ఈ సినిమాపై అల్లు అర్జున్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈయన కెరీర్ కు కూడా త్రివిక్రమ్ సినిమా కీలకంగా మారింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టి దసరాకు సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ప్రియ వారియర్ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. మరి బన్నీ, త్రివిక్రమ్ కలిసి చూపించబోయే నాన్నకు ప్రేమతో సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here