కుటుంబాన్ని ప‌రిచ‌యం చేసిన యాంక‌ర్ ర‌వి..

పెళ్లి గురించి దాచి పెట్టాల్సిన అవ‌స‌రం ఎవ‌రికీ ఉండ‌దు. కానీ యాంక‌ర్ ర‌వి మాత్రం ఈ విష‌యం గురించి చాలా రోజులు దాచేసాడు. ఎందుకో తెలియ‌దు కానీ పెళ్లి గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా మాట్లాడ‌లేదు ఈ యాంక‌ర్. కానీ ఇన్ని రోజుల త‌ర్వాత ఎందుకో తెలియ‌దు స్వ‌యంగా ర‌వి త‌న కుటుంబాన్ని ప‌రిచ‌యం చేసాడు. అయినా తెలుగు ఇండ‌స్ట్రీలో ఒట్టి ర‌వి అంటే పెద్ద‌గా గుర్తుపట్ట‌రు. కానీ ర‌వి ప‌క్క‌న లాస్య అనే పేరు రాస్తే చాలు ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఓ ప్లస్ మైన‌స్ క‌లిసి క‌రెంట్ పుట్టించిన‌ట్లు.. ర‌వి లాస్య ఒక‌రికొక‌రు త‌మ కెరీర్స్ కు పునాదులు వేసుకున్నారు. వీళ్ళ మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా అనుమానాలు కూడా పుట్టించింది.


ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని టాక్ కూడా వ‌చ్చింది. అయితే ఏం లేద‌ని త‌ర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా. యాంక‌ర్ ర‌వికి ఆరేళ్ళ కిందే పెళ్ళైపోయింద‌ని ఆ మ‌ధ్య సీక్రేట్ బ‌య‌ట పెట్టేసింది లాస్య‌. మేం ప‌రిచ‌య‌మైన ఏడాదికే ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది అంటూ గుట్టు విప్పేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వి ఈ ఇష్యూపై మాట్లాడ‌లేదు. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా త‌న భార్య నిత్యా స‌క్సేనాతో పాటు మూడేళ్ల కూతురును కూడా ప‌రిచ‌యం చేసాడు. సోష‌ల్ మీడియాలో ఈయ‌న పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అయితే ర‌వి ఎందుకు ఈ ఫోటోలు ప‌బ్లిష్ చేసాడ‌నేది మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here