ర‌జినీకాంత్ కూతురు సౌంద‌ర్య పెళ్లికి పోలీస్ ప్రొట‌క్ష‌న్.. 

ర‌జినీకాంత్ కూతురు త్వ‌ర‌లోనే పెళ్లి కూతురు కాబోతుంది. ఇప్ప‌టికే ఓ సారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సూప‌ర్ స్టార్ చిన్న కూతురు సౌంద‌ర్య మ‌రోసారి పెళ్లి చేసుకోబోతుంది. 2010లోనే సౌంద‌ర్య ర‌జినీకాంత్ తొలి పెళ్లి జ‌రిగింది. అయితే కొన్నేళ్లు ఉన్న త‌ర్వాత విడాకులు తీసుకుంది. ఈమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ త‌మిళ‌నాడు బిజినెస్ మ్యాన్ క‌మ్ యాక్ట‌ర్ విషాగ‌న్ వ‌నంగ‌మూడితో సౌంద‌ర్య మూడు ముళ్లు వేయించుకోడాని సిద్ధ‌మ‌వుతుంది సౌంద‌ర్య‌. వీళ్ల పెళ్లి ఫిబ్ర‌వ‌రి 10 నుంచి 12 మ‌ధ్య పొయేస్ గార్డెన్ లో జ‌ర‌గ‌బోతుంది. ఈ వేడుక భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ర‌జినీ దంప‌తులు.

ఇక దీనికి పోలీస్ ప్రొట‌క్ష‌న్ కావాలంటూ ల‌త ర‌జినీకాంత్ తానంపేట పోలీస్ స్టేష‌న్ కు ఓ లెట‌ర్ కూడా రాసిందిప్పుడు. విషాగన్ వనంగముడికు కూడా ఇది రెండో పెళ్లే.. అతడి తొలి భార్య‌తో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు సౌంద‌ర్య‌తో ప్రేమ‌లో ప‌డి.. ఇరు కుటుంబాల‌ను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈయ‌న కూడా కొన్ని సినిమాల్లో న‌టించాడు కానీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దాంతో సొంతంగా ఫార్మసిటకల్ కంపనీ పెట్టుకుని బిజినెస్ తో బిజీగా ఉన్నాడు. ఇక సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వంపై దృష్టి పెట్టింది. మొత్తానికి వీళ్ల పెళ్లి ఇప్పుడు త‌మిళ‌నాట హాట్ టాపిక్ అయిపోయింది. పోలీస్ ర‌క్ష‌ణ కావాల‌ని కోర‌డంతో మ‌రింత సంచ‌ల‌నంగా మారింది సౌంద‌ర్య రెండో పెళ్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here