అనుష్క శర్మ అక్క అమెరికాలో ఉందంట.. ట్విట్టర్లో జోకులు..

అనుష్క శర్మకు అక్క ఎక్కడుంది.. ఉంటే ఇన్నాళ్లు ఎందుకు బయటికి రాలేదు అనుకుంటున్నారా.. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7గురు ఉంటారంటారు కదా. ఇప్పుడు అనుష్క శర్మకు ఒకరు దొరికారు.. ఆమె ఆల్రెడీ ఉంది.. అంటే ఇంకో ఐదుగురు బాకీ. అచ్చంగా అనుష్క శర్మ లాగే ఉండే అమెరికన్ సింగర్ జూలియా మైకేల్స్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క శర్మ, జూలియా ఫోటోలు పక్కపక్కన పెట్టి అక్క చెల్లెలు అంటూ ప్రమోట్ చేస్తున్నారు కొందరు అభిమానులు. ఇది అటు ఇటు తిరిగి చివరికి జూలియా కంట పడ్డాయి.

దాంతో ఆమె ఊరుకోకుండా అనుష్క శర్మను హైలైట్ చేస్తూ హాయ్ అనుష్క నువ్వు నాకు చెల్లివి అంట అంటూ ట్వీట్ చేసింది. దీనికి అనుష్క శర్మ కూడా సరదాగా తీసుకొని ఇద్దరం దొరికాం.. ఇంకో ఐదుగురుని వెతకాలి అంటూ రిప్లై ఇచ్చింది. మొత్తానికి ఇద్దరి సంభాషణ ఇప్పుడు అభిమానులను బాగానే ఆకట్టుకుంటుంది. మనిషిని పోలిన మనుషులు ఉండటం నిజంగానే అరుదు. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడూ కలుస్తుంటారు.. ఇప్పుడు అనుష్క శర్మకు తనలా ఉండే మరో అమ్మాయి దొరికింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here