ప్రభాస్ తో అఖిల్ సినిమా.. నమ్మండి ప్లీజ్..

అసలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.. మన హీరోలంతా ఈగోలు పక్కనపెట్టి కథలు నచ్చితే ఎంచక్కా కలిసి నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో అఖిల్, ప్రభాస్ సినిమా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభాస్ అంటే హీరో కాదు దర్శకుడు.. నటుడు ఆది పినిశెట్టి అన్నయ్య ఈ సత్య ప్రభాస్ పినిశెట్టి. రవిరాజా పినిశెట్టి పెద్దకొడుకు ఈయన. అఖిల్ కోసం ప్రభాస్ ఒక అద్భుతమైన కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది. రెండేళ్ల నుంచి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది ఈ సినిమా. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది. మిస్టర్ మజ్ను సినిమా ఫ్లాప్ తర్వాత ఎలా చేయాలో అర్థం కాక అఖిల్ ఆలోచనలో పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందని తెలుస్తోంది. గుర్రపుస్వారీ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని.. తెలుగుతో పాటు తమిళ నాట కూడా ఈ చిత్రం తెరకెక్కిస్తే బాగుంటుంది అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.. కచ్చితంగా ఈ సినిమాతో ఒక విభిన్నమైన ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్నాడు అఖిల్ అక్కినేని. ఆయన కెరియర్కు ఇప్పుడు ఒక విజయం కచ్చితంగా అవసరం.. చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో ఏం చేయాలో ఈయనకు పాలుపోవడం లేదు. మొత్తానికి మరి అఖిల్, ప్రభాస్ సినిమా పట్టాలెక్కుతోందా లేదో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here