నేను మంచోన్ని.. హీరోయిన్ తో ఎఫైర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ.. 

ఓ దర్శకుడు వరుసగా ఒక హీరోయిన్ కు రెండు మూడు సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడంటే.. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం మొదలవుతుంది ఇండస్ట్రీలో. ఇది ఇక్కడ చాలా కామన్. ఏదీ లేకుండా వరుసగా అవకాశాలు ఇవ్వరు అని బలంగా నమ్ముతుంటారు ఇక్కడ. ఇప్పుడు అనిల్ రావిపూడి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన గత రెండు సినిమాల నుంచి మెహరీన్ కు అవకాశాలు ఇచ్చాడు. దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇన్నాళ్లూ చూసి చూడ‌న‌ట్లుగానే ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు ప్రచారం మరియు శృతిమించడంతో బయటకు రాక తప్ప‌లేదు.
Anil Ravipudi F2
ప్రస్తుతం ఎఫ్2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి తన ఎఫైర్స్ గురించి కూడా ఓపెన్ అయ్యాడు. అంతా అనుకుంటున్నట్లు తనకు ఏ హీరోయిన్ తో కూడా లింకు లేదని… ఎఫైర్ అనే మాటకు చాలా దూరంగా ఉంటానని అనవసరంగా ఉన్నవి లేనివి రాసి తన ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని కోరుతున్నాడు అనిల్ రావిపూడి. తాను ఏ హీరోయిన్ ను కూడా రికమండ్ చేయలేదని.. టాలెంట్ ఉన్న హీరోయిన్ల‌కు రికమండేషన్ అవసరం లేదంటున్నారు అనిల్. తన పనేదో తాను చేసుకుంటున్నాను అనవసరంగా తనను వివాదాల్లోకి లాగకండి అంటూ కోరుతున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈయన తెరకెక్కించిన ఎఫ్2 ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here