బాల‌య్య‌ను నాగ‌బాబు ఇంక వ‌ద‌ల‌డా..?

మెగా నందమూరి కుటుంబాల మధ్య ఇప్పుడు సంబంధాలు బాగానే ఉన్నాయి. అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ కలిసి రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు కూడా. వీళ్ళను చూసి అభిమానులు కూడా కలిసిపోతున్నారు. ఇన్నాళ్లు మీకు మీరే మాకు మేమే అంటూ పాటలు పాడుకున్న అభిమానులు కూడా కలిసి ఉంటే కలదు సుఖం అంటున్నారు. కానీ వీళ్ళ మధ్య లేనిపోని అంతర్యుద్ధాలకు తెర లేపుతున్నారు నాగబాబు. ఎందుకో తెలియదు కానీ ఈయన కొన్నాళ్లుగా బాలకృష్ణతో కోరి మరీ గిల్లికజ్జాలు ఆడుతున్నాడు. అవకాశం దొరక్కపోయినా దొరకబుచ్చుకొని మరి ఆయనతో ఆడుకోవాలని చూస్తున్నాడు.

naga babu satire on biopics
naga babu satire on biopics

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ ఈ వివాదానికి తెరలేపిన నాగబాబు.. ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దాన్ని నంద‌మూరి అభిమానులు మరిచిపోయినా కూడా నాగబాబు మర్చిపోవడం లేదు. తాజాగా మరోసారి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడు మెగా బ్రదర్. ఫేస్ బుక్ లో ఎన్టీఆర్ బయోపిక్ ను తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేశారు నాగబాబు. బయోపిక్ అంటే నిజాలు తీయాలి కాని ఉన్నవి లేనివి జోడించి అబద్దాలు ఎందుకు తీస్తున్నారు విశ్వదాభిరామ వినర మామ అంటూ సెటైరికల్ కవిత్వం రాసి పోస్ట్ చేశాడు ఈ మెగా సోద‌రుడు. ఇది చూసిన నందమూరి అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. మరి దీనికి నాగబాబు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here