గీత‌గోవిందం.. సెంటిమెంట్ క‌లిసొస్తే బ్లాక్ బ‌స్ట‌రే..!

ఇండ‌స్ట్రీలో ఒక్కోసారి సెంటిమెంట్స్ ను చాలా బ‌లంగా న‌మ్ముతారు. కొన్ని సార్లు క‌థ‌ల కంటే కూడా సెంటిమెంట్స్ పైనే ఎక్కువ‌గా న‌మ్మ‌కంతో ఉంటారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడు గీత‌గోవిందం విష‌యంలోనూ ఇలాంటి ఓ సెంటిమెంట్ ఆస‌క్తి రేపుతుంది. అదే విడుద‌ల‌కు ముందు లీకేజ్.
GEETHA GOVINDAM SENTIMENT
అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది సినిమా కూడా విడుద‌ల‌కు ముందే లీక్ అయింది. అప్పుడు ఇండ‌స్ట్రీ అంతా ఆ సినిమాకు అండ‌గా నిల‌బ‌డి.. స‌పోర్ట్ చేసింది. ఇప్పుడు గీత‌గోవిందం విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. మేమున్నాం అంటూ అల్లుఅర‌వింద్ తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అంతా ధైర్యం చెబుతున్నారు.
అప్పుడు చాలా సింప‌తితో విడుద‌లైన అత్తారింటిరి దారేది ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసింది. పైర‌సీ ఉన్నా కూడా అత్తారింటి కోసం అంతా థియేట‌ర్స్ కు కదిలారు. ఇప్పుడు గీత‌గోవిందంకు కూడా ఇదే సెంటిమెంట్ క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీనిపై కూడా ఇప్పుడు చాలా సింప‌తి ఉంది. దానికితోడు పాజిటివ్ వైబ్రేష‌న్స్ కూడా ఉన్నాయి. సినిమాను ఇండియాలో 600 థియేట‌ర్స్.. ఓవ‌ర్సీస్ లో 300 లొకేష‌న్స్ లో విడుద‌ల చేస్తున్నారు. పైగా ఆగ‌స్ట్ 15 సెల‌వు రోజు కావ‌డంతో ఓపెనింగ్స్ కూడా బ్ర‌హ్మాండంగా వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి ఈ సెంటిమెంట్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here