హ‌న్సిక వ‌య‌సేంటి.. ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే కొడుకేంటి..?

హన్సిక వయసు ఎంత.. ఇప్పుడు ఆమె వ‌య‌సుతో మనకి ఏం పని అనుకుంటున్నారా.. అవసరమే కచ్చితంగా అవసరమే.. ఎందుకంటే ఇప్పుడు ఈమె చేసిన ఓ కామెంట్ సంచలనం సృష్టిస్తుంది కాబ‌ట్టి క‌చ్చితంగా వ‌య‌సు అవ‌స‌ర‌మే. ఈ ఏడాది తన కొడుకు పదో తరగతి చదువుతున్నాడని చెప్పింది హన్సిక. 30 ఏళ్లు కూడా లేని హన్సికకు పదవ తరగతి చదివే కొడుకు ఎక్కడ నుంచి వచ్చాడు అంటూ ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. హన్సిక కేవలం నటిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తన సంపాదించే డబ్బులో చాలా వ‌ర‌కు అనాథ‌ల‌ కోసం ఖర్చు పెడుతుంది.

hansika with orphans

ముంబైలో వాళ్ల కోసం ఒక బిల్డింగ్ కూడా కట్టే పనిలో ఉంది హన్సిక. ఇందులో ఒక అబ్బాయి ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నాడు. ఇప్పటికే హన్సిక నడుపుతున్న అనాధాశ్రమంలో 34 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో పదవ తరగతి చదువుతున్న కుర్రాడు ప‌రీక్ష‌లు బాగా రాయాల‌ని.. మంచి మార్పులు రావాలని.. తన భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఇదే త‌న న్యూ ఇయర్ విష్ తెలిపింది హన్సిక. ఇంత మంచి మనసు ఉన్న హ‌న్సిక‌ను చూసి అభిమానులు పొంగిపోతున్నారు. నిజంగానే హన్సిక లాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. తాము సంపాదించిన డబ్బులు చాలావరకు ఇలా అనాధల కోసం ఖర్చు పెట్టడం గొప్ప విషయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here