హ‌రీష్ శంక‌ర్ తో నాని అంట‌..!

డిజే త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌క అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు హ‌రీష్ శంక‌ర్. దాగుడు మూత‌లు క‌థ రాసుకున్నా కూడా పి్ప‌ట్లో అది ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మే. దిల్ రాజు కూడా వ‌ద్ద‌న‌డంతో ఏం చేయాలో తెలియ‌క క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నాడు హ‌రీష్. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడికి త‌న వంతు సాయం చేయ‌డానికి ముందుకొస్తున్నాడు నాని.
HARISH SHANKAR NANI MOVIE
త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే నాని కోసం హ‌రీష్ శంక‌ర్ ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ ఒక‌టి సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. షాక్.. రామ‌య్యా వ‌స్తావ‌య్యా త‌ప్ప హ‌రీష్ శంక‌ర్ చేసిన సినిమాల‌న్నీ బాగానే ఆడాయి. కాక‌పోతే అన్నీ రొటీన్ క‌థలు ఈ ద‌ర్శ‌కుడికి మైన‌స్.
ఇదే ఇప్పుడు స్టార్ హీరోల‌కు ఈ ద‌ర్శ‌కున్ని దూరం చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాని మాత్రం హ‌రీష్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లే తెలుస్తుంది. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం దేవ‌దాసుతో పాటు జెర్సీ సినిమాల‌కు కూడా క‌మిట‌య్యాడు నాని. ఈ రెండూ ఈ ఏడాది పూర్తి కానున్నాయి. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ సీన్ లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here