మహర్షితో మహేష్ ఆ రికార్డు అందుకుంటాడా..

ఈ హీరో కెరీర్ లో నైనా 25.. 50.. 100వ సినిమాలు కీలకం. వాళ్ల జీవితం మొత్తం ఆ సినిమాలు గుర్తుండిపోతాయి. ఫలితం తో పనిలేకుండా ఆ సినిమాలు కచ్చితంగా బాగుండాలని కోరుకుంటారు హీరోలు. టాలీవుడ్ లో కూడా కొందరు హీరోలకు ఈ మైల్ స్టోన్ మూవీస్ బాగానే కలిసి వచ్చాయి. ఎన్టీఆర్ కు నాన్నకు ప్రేమతో 25వ సినిమా.. అలాగే బాలకృష్ణకు గౌతమీపుత్ర శాతకర్ణి 100వ సినిమా.. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా మన హీరోలకు కూడా కొంతమందికి మైల్ స్టోన్ మూవీస్ విజయాలు తీసుకొచ్చాయి. అదే సమయంలో ఈ సినిమాలతో ఫ్లాప్ అందుకున్న హీరోలు కూడా లేకపోలేదు. గత ఏడాది గోపీచంద్ నటించిన 25వ సినిమా పంతం డిజాస్టర్ గా మారింది.

mahesh babu maharshi second look
mahesh babu maharshi second look

ఇక సుమంత్ 25వ సినిమా సుబ్రమణ్యపురంను కనీసం ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి మన హీరోలకు. ఇక ఇప్పుడు తన 25వ సినిమాతో వస్తున్నాడు మహేష్ బాబు. ఈయన నటిస్తున్న మహర్షి ఆయనకు 25వ సినిమా. అందుకే ఈ సినిమా పై చాలా జాగ్రత్తగా ఉన్నాడు మహేష్ బాబు. లుక్ విషయంలో కూడా ఇప్పటివరకు కొత్తగా ట్రై చేయండి సూపర్ స్టార్.. ఈ సినిమా కోసం గడ్డం పెంచాడు. వంశీ పైడిపల్లి కూడా కథ నుంచి లుక్కు వరకు అన్నీ కొత్తగా ట్రై చేశాడు. ఇప్పుడు విడుదలైన రెండో లుక్ కూడా అద్భుతంగా ఉంది. మహేష్ అలా నడిచి వస్తుంటే బ్లాక్ అండ్ వైట్ కోట్ లో పిచ్చెక్కించాడు. అభిమానులు ఆ లుక్కు చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య భారీ షెడ్యూల్ పూర్తి చేసిన వంశీ పైడిపల్లి జనవరిలో కొత్త షెడ్యూల్ కు ముహూర్తం పెట్టనున్నాడు. సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. మరి మహర్షి మహేష్ బాబు కెరీర్లో ఎలాంటి తీపిగుర్తులు మిగిల్చనుందో చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here