త్రివిక్రమ్, బన్ని మధ్య ఆ పెద్ద హీరో రాయబారం..

త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాకు రాయబారం నడిపింది ఎవరు.. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. రావాల్సిందే ఎందుకంటే త్రివిక్రమ్, బన్ని సినిమా కన్ఫమ్ కూడా చాలా రోజులు అయ్యింది కానీ ఈ సినిమా పట్టాలెక్కకపోవడానికి కారణం నిర్మాతలు. తన ఆస్థాన నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ లోనే అల్లు అర్జున్ సినిమా నిర్మించాలని పట్టుబట్టాడు త్రివిక్రమ్. మరోవైపు తన సొంత సంస్థ గీతా ఆర్ట్స్ లో నిర్మించాలని పట్టుబట్టాడు బన్నీ.

కానీ పొత్తు కుదరక పోవడంతో ఓ దశలో ఈ సినిమా చేద్దామని ఆలోచన కూడా చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి బన్నీ, త్రివిక్రమ్ మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఆయన మధ్యలో ఎంటర్ అయిన తర్వాత అటు గీతా ఆర్ట్స్, ఇటు హారిక హాసిని క్రియేషన్స్ కలిసి బన్నీ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాయి. జనవరిలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దసరాకు విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్.

Allu Arjun Trivikram AA19
Allu Arjun Trivikram AA19

గత ఏడాది అరవింద సమేత సినిమా మంచి విజయం అందుకున్న ఈ దర్శకుడు.. మరోసారి అదే చేయాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ తో ఇదివరకే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్ సినిమా తో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి విడిపోయింది అనుకున్న త్రివిక్రమ్, బన్ని కాంబినేషన్ ను చిరంజీవి కలిపాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు. మరి ఈ సినిమాతో ఈ జోడి ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారో చూడాలిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here