అర్జున్ రెడ్డిలో ఐటం సాంగ్ ఏంటి రాజా..?

అర్జున్ రెడ్డి అనేది ఇప్పుడు పేరు కాదు.. అదో బ్రాండ్. సినిమా వ‌చ్చి ఏడాది కావొస్తున్నా కూడా ఇప్ప‌టికీ ఆ హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌టికి రాలేదు ప్రేక్ష‌కులు. ఇక ఇత‌ర ఇండ‌స్ట్రీలు కూడా అర్జంట్ గా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నే తొంద‌ర‌లో ఉన్నారు. ఇప్ప‌టికే త‌మిళ్ లో వ‌ర్మ పేరుతో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బాల అర్జున్ రెడ్డిని విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కృష్ణ‌తో రీమేక్ చేస్తున్నాడు. క ఇప్పుడు హిందీలో సందీప్ రెడ్డి వంగానే రీమేక్ చేస్తున్నాడు.
ARJUN-REDDY-ITEM-SONG-IN-HINDI-REMAKE
అక్క‌డ షాహిద్ క‌పూర్ హీరోగా ఇది రానుంది. ఆగ‌స్ట్ 20 నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. అక్క‌డ కూడా దీనికి అర్జున్ రెడ్డి అనే టైటిల్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బేసిగ్గా అక్క‌డ రెడ్లు ఉంటారు. కానీ సందీప్ మాత్రం ఇదే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. పైగా రీమేక్ అనేది ఉన్న‌ది ఉన్న‌ట్లు చేయ‌డం లేదని చెబుతున్నాడు సందీప్. తాను మ‌ళ్లీ ఓ కొత్త సినిమా మాదిరే తెర‌కెక్కించాల‌నుకుంటున్న‌ట్లు.. తెలుగులో మిస్ అయిన చాలా అంశాల‌ను హిందీ అర్జున్ రెడ్డిలో చూపించ‌బోతున్న‌ట్లు చెప్పాడు సందీప్ రెడ్డి.
ఇదే క్ర‌మంలో ఇప్పుడు హిందీ రీమేక్ లో ఐటం సాంగ్ కూడా ఉంద‌ని తెలుస్తుంది. అస‌లు అర్జున్ రెడ్డి క‌థ‌లో ఐటం సాంగ్ కు స్థాన‌మే లేదు. అలాంటిదిప్పుడు సందీప్ ఆ వైపుగా ఆలోచిస్తుండ‌టంతో.. అస‌లు సినిమాను చెడ‌గొట్ట‌డు క‌దా అని కంగారు ప‌డుతున్నారు అభిమానులు. అయినా త‌న క‌థ గురించి తన కంటే ఎవ‌రికి బాగా తెలుసు.. అందుకే సందీప్ అన్ని జాగ్ర‌త్త‌గా బాగానే తీసుకుంటు న్నాడు.
చూసిన వాళ్ల‌కు ఇది రీమేక్ లా అనిపించ‌ద‌ని.. మ‌ళ్లీ కొత్త సినిమా మాదిరే ఉంటుంద‌నే హామీ ఇస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న తీరు చూస్తుంటే అర్జున్ రెడ్డికి అమ్మ‌మొగుడు లాంటి రీమేక్ అక్క‌డ తీయ‌బోతున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. జూన్ 21, 2019న హిందీలో అర్జున్ రెడ్డి విడుద‌ల కానుంది. టీ సిరీస్ భూష‌న్ కుమార్ మ‌రో ముగ్గురు నిర్మాత‌ల‌తో క‌లిసి దీన్ని నిర్మిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here