కే జి ఎఫ్ అమెజాన్ లో వచ్చేస్తోంది.. పండగ చేసుకోండి..

గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సినిమా కే జి ఎఫ్. అప్పటివరకు కన్నడ సినిమాలంటే చాలా తక్కువ అంచనాలు ఉండేవాళ్లకు ఈ సినిమా దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 230 కోట్లకు పైగా వసూలు చేసింది కే జి ఎఫ్ సినిమా. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంతో యశ్ నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు. కోలార్ బంగారు గనులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.

KGF First Day Collections

తెలుగులో కూడా దాదాపు 12 కోట్లు షేర్ తీసుకొచ్చింది కే జి ఎఫ్. ఇక ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ లో విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు అమేజాన్. సినిమా వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. థియేటర్లలో ఎలా అయితే దుమ్ము దులిపేసిందో అమెజాన్ లో కూడా కే జి ఎఫ్ రఫ్ఫాడిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొందరు అభిమానులు వేచి చూస్తున్నారు. మరి వెండితెరపై రఫ్ఫాడించిన కే జి ఎఫ్ చిన్నితెరపై ఏం చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here