హుషారు దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఊపిరి సలపనంత బిజీగా వరుస సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్.. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. వెంకీ సినిమాకు ఇంకా చాలా టైం ఉంది.

ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాత వెంకీ అట్లూరి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు ఈ కుర్ర హీరో. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ కోసం మరో దర్శకుడు కూడా కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది. ఆయన పేరు శ్రీహర్ష కొనగంటి. హుషారు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఆ చిత్రం మంచి విజయం సాధించింది. చిన్న సినిమాగా విడుదలై దాదాపు 10 కోట్ల షేర్ వసూలు చేసింది. 2018 తెలుగు ఇండస్ట్రీలో చివరి విజయంగా నిలిచింది హుషారు. ఇక ఇప్పుడు ఈయన దృష్టి విజయ్ దేవరకొండపై పడింది. ఆయన కోసం ప్రత్యేకంగా కథ సిద్ధం చేసి ఒప్పించే పనిలో బిజీగా ఉన్నాడు శ్రీహర్ష. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండను ఒప్పించడం చిన్న విషయం కాదు.. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ కుర్రహీరో శ్రీ హర్షకు అవకాశం ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

VijayDevarakonda husharu director

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here