మిస్టర్ మజ్ను మూడు రోజుల పరిస్థితి ఏంటి.. అఖిల్ హిట్ కొట్టాడా..

అఖిల్ హిట్ కొట్టడం ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది. ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా విజయం అనే మాట రావడం లేదు. ఇప్పుడు విడుదలైన మిస్టర్ మజ్ను సినిమా కూడా ఊహించిన విజయం సాధించడం లేదు. ఈ చిత్రం మూడు రోజుల్లో కేవలం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 23 కోట్లు వస్తేగానీ సేఫ్ కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ లో కూడా చాలా తక్కువ తీసుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరీ దారుణంగా ఉంది. వీకెండ్ కూడా అయిపోవడంతో నాలుగవ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు దర్శక నిర్మాతలు.

mr majnu first day collections

ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా అఖిల్ సినిమాను కొని మరోసారి నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈయన గత సినిమాలు హలో, అఖిల్ కంటే కూడా తక్కువ వసూళ్లు తీసుకొస్తుంది. తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా అయినా కూడా కలెక్షన్ల వేటలో మాత్రం మిస్టర్ మజ్ను చాలా వెనుకబడి పోయింది. మూడవ రోజు కూడా కేవలం రెండు కోట్ల 50 లక్షలు షేర్ మాత్రమే తీసుకువచ్చింది ఈ సినిమా. దీనికంటే వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమా ఎక్కువ వసూళ్లు తీసుకొచ్చింది. మొత్తానికి మిస్టర్ మజ్నుతో హిట్ కొట్టాలని కలలుగన్న ఆశలకు మరోసారి బ్రేకులు పడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here