నాగ‌బాబు మ‌ళ్లీ వ‌చ్చాడండోయ్.. ఈ సారి టార్గెట్ తెలుగుదేశం..

నాగబాబు ఈజ్ బ్యాక్.. ప‌ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈయన మళ్లీ రచ్చ మొదలు పెట్టాడు. ఈసారి ఏకంగా వ్యక్తిని కాదు వ్యవస్థనే టార్గెట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందులో ముఖ్యంగా నారా లోకేష్ సెటైర్లు వేసి చంపేశాడు నాగబాబు. ఆయన ఎప్పుడూ రెండేళ్ల కింద నోరు జారిన వీడియోను ఇప్పుడు తీసుకొని దాని మీద సెటైర్లు వేసాడు నాగబాబు.

nagababu balakrishna

అసలు అప్పుడెప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు హైలైట్ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు అభిమానులు. ఇందులో నాగబాబు ఉద్దేశం ఏంటి.. అసలు ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నాడు.. నాగబాబు వెనక ఉన్నది ఎవరు.. ఇంత పోతుంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఏం చేస్తున్నారు ఇలా చాలా అనుమానాలు అభిమానుల్లో వస్తున్నాయి.
కానీ వాళ్ళకి తెలియకుండా నాగబాబు ఇదంతా నడిపిస్తున్నాడు అంటే నమ్మడం అంత ఈజీ కాదు.

ఇప్పుడు ఇదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ గా మాట్లాడటానికి తెలుగుదేశంను కించపరుస్తున్నారు నాగబాబు. వాళ్ల మీద విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. నారా లోకేష్ అప్పుడప్పుడో ఈ రాష్ట్రంలో బంధుప్రీతి, కులపిచ్చి, మదపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే నోరు జారాడు. దానిపై ఇప్పుడు సెటైర్లు వేస్తూ.. రాజకీయ నిజాయితీపరుడు ఈ దేశంలో ఎవ‌రూ లేరంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఈయన తీరు చూస్తుంటే ఈ యుద్ధం ఎక్కడ ముగుస్తుందో అనే భయం అభిమానుల్లో కూడా మొదలైంది. మరి దీనికి ముగింపు ఎక్కడ పలుకుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here