మ‌హానాయ‌కుడుతో బాల‌య్య బిజీ బిజీ.. ధ‌ర్నా చేస్తున్న క్రిష్..

బాలకృష్ణ మళ్లీ బిజీ అయిపోయాడు.. ఆమధ్య కథానాయకుడు సినిమా ప్రమోషన్ కోసం కొన్ని రోజులు మహానాయకుడు షూటింగ్ కు దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లోనే ఈ చిత్రం షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఏపిపిఏ గ్రౌండ్స్ లో మహానాయకుడు షూటింగ్ జరుగుతుంది. అక్కడే 600 మంది జూనియర్ ఆర్టిస్టులు మధ్య ఒక ధర్నా సీన్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు క్రిష్. సినిమాలో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ సమయంలో వచ్చే సీన్ ఇది అని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్, రానా కూడా పాల్గొన్నారు. కథానాయకుడులో ఏవైతే అంశాలు లేవని అభిమానులు బాధపడుతున్నారో అవన్నీ మహానాయకుడులో ఉంటాయ‌ని ధీమాగా చెబుతున్నాడు దర్శకుడు క్రిష్.

NTR Mahanayakudu Working Stills

 

ఈ సినిమాతో కచ్చితంగా అభిమానుల అంచనాలు అందుకోవడమే కాకుండా కథానాయకుడు మిగిల్చిన నష్టాలను కూడా భర్తీ చేస్తానంటున్నాడు ఈయ‌న‌. ఈయన ఫిబ్రవరి 7న మహానాయకుడు విడుదల కావాల్సి ఉన్నా కూడా ఈ సినిమాని మరో వారం రోజులపాటు పోస్ట్ పోన్ చేశారు. ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజు మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం మరి ఫ్లాట్ గా ఉందని విమర్శలు రావడంతో మహానాయకుడులో కాస్త మసాలా పెంచనున్నారు క్రిష్. మరి ఈయన పెంచుతున్న మసాలా సినిమా విజయానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. బాలకృష్ణ మాత్రం మహానాయకుడుపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here