క‌ల్కి టీజ‌ర్ విడుద‌ల‌.. రాజ‌శేఖ‌ర్ హిట్ కొడ‌తాడా..? 

సీనియ‌ర్ హీరో రాజశేఖర్ హీరోగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 4న రాజశేఖర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. గరుడవేగ వ‌చ్చిన‌పుడు విడుద‌ల త‌ర్వాత త‌ను మాట్లాడ‌తాన‌ని చెప్పాన‌ని.. అప్పుడు సినిమా వ‌చ్చిన త‌ర్వాతే మాట్లాడాన‌ని చెప్పాడు ఈ హీరో. గరుడవేగ లాంటి సినిమా త‌ర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో త‌న‌కు దొరికిన అద్భుత‌మైన క‌థ ఈ క‌ల్కి అంటూ మ‌న‌సులో మాట చెప్పాడు రాజ‌శేఖ‌ర్.

 

rajasekhar kalki teaser release

అప్పుడే క‌థ ఓకే చేసినా కూడా ఆ త‌ర్వాత ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం చాలా రోజులు ఎదురు చూసాన‌ని చెప్పాడు ఈ హీరో. గరుడవేగకి ప్రవీణ్ సత్తారుతో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో.. ఇప్పుడు అంతే అంటున్నాడు రాజ‌శేఖ‌ర్. ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామంటూ చెప్పాడు రాజ‌శేఖ‌ర్. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు టీజ‌ర్ కూడా.. త్వ‌ర‌లోనే సినిమా రానుంది. 1983 నేప‌థ్యంలో సాగే తెలంగాణ క‌థ ఇది. మ‌రి గ‌రుడ‌వేగ‌తో రీ ఎంట్రీ ఇచ్చిన రాజ‌శేఖ‌ర్ క‌ల్కితో ఏం మాయ చేస్తాడో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here